హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఏపీ పోలీసులు హడావుడి చేశారు. ఓ కానిస్టేబుల్‌ను బలవంతంగా తీసుకెళ్తుంటే.. ఆ కానిస్టేబుల్ మార్గమధ్యంలో జీపు నుంచి దూకేశాడు. దీంతో రోడ్డు మీదే ఏపీ పోలీసులు అతడిని మళ్లీ జీపు ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఆయన మాత్రం తాను జీపు ఎక్కనంటూ పోలీసులు కాళ్లు పట్టుకున్నాడు. ఈ ఘటనను చూసిన అక్కడి స్థానికులు అక్కడికి గుమికూడి.. తమ సెల్‌ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టడంతో.. ఏపీ పోలీసులు.. అతడిని అక్కడే వదిలేసి జీపులో వెళ్లిపోయారు.
తర్వాత.. అక్కడి స్థానికులతో మాట్లాడిన ఆ కానిస్టేబుల్.. తన పేరు మధు అని.. ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌నని.. తనను బలవంతంగా విజయవాడ తీసుకెళ్తున్నారని.. తనకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని.. తనకు హైదరాబాద్‌లోనే డ్యూటీ చేయాలనుందని తెలిపాడు. విజయవాడలో తనకు డ్యూటీ చేయడం ఇష్టం లేదని చెప్పినా.. తనను బలవంతంగా జీపు ఎక్కించి విజయవాడ తీసుకెళ్లబోయారని.. అయితే.. తాను జీపు నుంచి దూకేశానని స్థానికుల ముందు మధు వాపోయాడు. అనంతరం మధు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.