ప్రేమలో ఉన్నప్పుడు ఒత్తిడిగా ఫీలవుతున్నారా? ఐతే ఇది తెలుసుకోవాల్సిందే..

-

టైటిల్ చూడగానే అందరికీ వచ్చే సందేహం ఒక్కటే. ప్రేమలో ఉన్నప్పుడు గాల్లో తేలుతున్నట్టుగా ఫీలవుతుంటారు కదా! ఒత్తిడికి గురి కావడం ఏంటీ అని. మీరనుకున్నది నిజమే కానీ, కొన్ని కొన్ని సార్లు ప్రేమ కూడా అనవసరమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది. అందుకే దాన్నుండి తొందరగా బయటపడడం చాలా ముఖ్యం. అసలు ఒత్తిడిలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దానికేమైనా సంకేతాలున్నాయా అనేది ఇక్కడ చూద్దాం.

ప్రేమలో మొదట్లో బాగానే ఉంటుంది. కానీ మధ్యలోకి వెళ్ళినపుడు చిన్న చిన్న అలకలు, ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని ప్రశ్నించడాలు, వేరే వాళ్ళతో కొద్దిగా చనువుగా మాట్లాడినా అనుమానం మొదలగునవి వస్తుంటాయి. ఇవే మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. మీ భాగస్వామి ఫోన్ చేస్తున్నప్పుడు మీరేం చెప్పాలా అని ఆలోచిస్తూ, ఫోన్ ఎత్తడం ఆలస్యం చేస్తున్నారంటే మీరు ఒత్తిడికి గురవుతున్నట్టే లెక్క. ఫోన్ ఎత్తితే ఏం గొడవ జరుగుతుందోనన్న భయం మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

అదే కాదు చిన్న చిన్న విషయాలకి ఏడవడం, తరచుగా అబద్ధాలు చెప్పడం, అలా చెబుతూ చెబుతూ దొరికిపోవడం మొదలగునవన్నీ ఒత్తిడికి గురి చేసే కారణాలే. ఇవి మొదట్లో బాగానే ఉంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. పొసెసివ్ నెస్ లో భాగం అనుకుని హ్యాపీగా ఫీలవుతారు. కానీ రాను రాను ఆ పొసెసివ్ నెస్ గుదిబండలా మారి మీ మెడకు చుట్టుకుంటుంది. అప్పుడు దాని మోయలేక, దించలేక ఇబ్బంది పడతారు. భాగస్వామి ఫోన్ చేస్తున్నప్పుడూ మీలో టెన్షన్ పెరుగుతుందంటే మీ బంధం సరిగ్గా లేనట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Latest news