సోషల్ మీడియాకు నేటి తరం బానిసలు అనటంలో ఎలాంటి సందేహం లేదు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియాలో గంటలు గంటలు టైమ్ స్పెండ్ చేస్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా సరే..ఆ రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు.. కొన్నిసార్లు పదినిమిషాలు చూసి క్లోజ్ చేస్తాం అనుకోని తెలియకుండానే గంట చేస్తారు.. అప్పటికీ వేరే ఏదైనా పని వల్ల బలవంతంగా ఆపుతారు కానీ లేకపోతే.. ఎన్ని గంటలు అయినా అలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పోతూనే ఉంటారు.. ఈ అలవాటును వదిలించుకోవాలి అనుకుంటున్నారా..? కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా .. ఈ రీల్స్ పిచ్చిలోంచి బయటపడొచ్చు.. మీ టైమ్ కూడా చాలా సేవ్ అవుతుంది.
మీకు రీల్‌లు కనిపించే అప్లికేషన్‌ను లాక్ చేసి పెట్టుకోండి.. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ దృష్టి మాటిమాటికి రీల్స్‌పైకి వెళ్లదు..
టైమర్‌ని సెట్ చేయడం ద్వారా రీల్స్‌ను స్క్రోలింగ్ నియంత్రించవచ్చు.. ఇన్‌స్టాల్‌ను ఎంత సేపు వాడాలో మీరే ఒక టైమ్ పెట్టుకుంటే.. ఆటోమెటిక్‌గా మీరు ఆ టైమ్ దాటితే.. నోటిఫికేషన్ వస్తుంది.. తద్వారా యాప్ నుంచి బయటకురావొచ్చు..కనీసం అలర్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే రాకపోయినా..మీకు ఒక ఐడియా వస్తుంది..నేను పెట్టుకున్న టైమ్ కంటే.. ఎక్కువ వాడుతున్నాను అని. అది కూడా మంచి విషయమే.. మెసేజ్ వచ్చిన పది నిమిషాల కైనా మీరు రీల్స్ క్లోజ్ చేస్తారు..
మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సమయాన్ని గడపడానికి రీల్స్ చూస్తున్నట్లయితే , మీరు నడక లేదా పుస్తకాలు చదవడం మీ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు.
రీల్‌లను చూసే అలవాటును మానేయడానికి… ఎవరైతే మీకు తరచూ రీల్స్ షేర్ చేస్తుంటారో వాళ్లకు కాల్ చేసి చెప్పండి.. అసలు రీల్స్ షేర్ చేయొద్దని.. లేదా మీరు వారి అకౌంట్‌ను మ్యూట్ చేసి పెట్టుకోండి.
ఫోన్‌ని ఉపయోగించడానికి సమయ పరిమితిని సెట్ చేయండి. సానుకూల ప్రభావాన్ని మీరే చూడండి. ఒక నెల పాటు ఈ చిట్కాను అనుసరించడం ద్వారా రీల్ వ్యసనానికి వీడ్కోలు చెప్పండి.
స్క్రోలింగ్ రీల్స్ అలవాటు మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి మీరు ఇక్కడ పేర్కొన్న నియమాలను అనుసరించడం ద్వారా సమస్యకు వీడ్కోలు చెప్పవచ్చు.