Earth: భూమికి ఎదురుగా వస్తున్న పెద్ద ఉల్క: స్టడీ

-

ఇప్పటికే ప్రపంచమంతా కూడా ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కూడా చాలా ఎక్కువ ఇబ్బందులకు గురి అయింది. అయితే ఈ ప్రపంచానికి ఈ సమస్యలు సరిపోవు అంటూ కొత్త సమస్యలు కూడా రానున్నాయి. భూమికి (Earth) ఎదురుగా వస్తున్న పెద్ద ఉల్క.

భూమికి / earth
భూమికి / earth

స్పేస్ అప్ డేట్ ప్రకారం తాజాగా ఒక వార్త వచ్చింది. NASA సైంటిస్టులు పెద్ద ఉల్క భూమికి ఎదురుగా రానుంది అని చెప్తున్నారు. అయితే ఆవుల ఎంత పెద్దది అంటే దానిని ఒక గ్రహం అనచ్చు. కానీ స్టడీ మరియు రీసెర్చ్ ప్రకారం దానిని ఉల్క అని అన్నారు.

ఏది ఏమైనా సైంటిస్టులు అది భూమికి ఎదురుగా వస్తోంది అని చెప్తున్నారు. అరవై రెండు మీటర్లు ఉండే ఈ ఉల్క హఠాత్తుగా భూమికి ఎదురుగా వస్తుందని ఇటువంటి పెద్ద దానిని ఎప్పుడూ చూడలేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

దీనిని వినగానే వాళ్లు కూడా షాక్ అయ్యారని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు. అయితే మొట్టమొదట్లో దీనిని చూసినప్పుడు ఇది చాలా చిన్నగా ఉంటుందని అనుకున్నారు కానీ పరిశీలించి చూస్తే ఇది చాలా పెద్దగా ఉందని గ్రహం లాగ ఇది ఉందని చెప్పారు.

చిలీలోని సెరో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీ యొక్క డార్క్ ఎనర్జీ కెమెరాతో గుర్తించబడింది. దీనికి సి / 2014 యుఎన్ 271 అని పేరు పెట్టారు. ఇదే కాకుండా దీనికి బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ అనే పేరు కూడా పెట్టారు.

దీనిని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఉల్కకు అతని పేరు పెట్టారు. ఇది ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద ఉల్క అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఒక ఉల్క సూర్యుని చుట్టూ పూర్తి విప్లవం చేయడానికి 200 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇది గత 6 లక్షల సంవత్సరాలుగా తిరుగుతోందని అన్నారు.

10 సంవత్సరాల తరువాత ఇది వస్తుందా..?

దీనిని స్టడీ చెయ్యడానికి 10 సంవత్సరాలు ఉన్నాయని చెప్పారు. ఇది 23 జనవరి 2031 న భూమికి దగ్గరగా వస్తుంది. అయితే భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఒకవేళ పొరపాటున ఢీకొడితే భూమి నాశనం అవ్వడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news