దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌: మరో కరోనా వ్యాక్సిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ ధాటికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ పేరుతో అందరిని కలిచివేసింది. ఈ కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా విజయవంతంగా అన్ని ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. మొదటి నుంచి మన దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ కొరత నేపథ్యంలో దేశంలో మరో వ్యాక్సిన్‌ పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేంద్రం.

అమెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్‌ దిగుమతి, అమ్మకాల కోసం మల్టీ నేషనల్‌ ఫార్మా కంపెనీ సిప్లాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. దీనిపై కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. ఈ మోడెర్నా వ్యాక్సిన్‌ రాకతో… నాలుగో కరోనా వ్యాక్సిన్‌ దేశంలో అందుబాటులోకి వచ్చినట్లైంది. దీంతో దేశంలో వ్యాక్సిన్‌ కొరత కాస్త తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news