మనిషి చనిపోవటాన్ని కుక్క ముందే పసిగడుతుందా..కుక్క అరుపుకు..చావుకు అసలు సంబంధం ఉందా..?

మనిషి చనిపోయేముందు పక్కన వ్యక్తికంటే ఆ విషయాన్ని ప్రకృతికి ముందు తెలుస్తుంది అని పెద్దొళ్లు చెప్తుంటారు. ఒకవేళ కుక్క అరవటం లేదా ఏడ్వటం చేసింది అంటే ఆ చుట్కుపక్కల ఉన్న ఎ‌వరైన చనిపోబుతున్నారని కొందరు నమ్ముతుంటారు. మనకి కూడా కుక్కలు, నక్కలు ఏడ్వటం లాంటివి వింటే మనసులో ఒక అలజడి మొదలవుతుంది. ఏదో కీడు అనిపిస్తుంది చాలామందికి. ఎన్నోఏళ్ల నుంచి ఈ విషయాన్ని మన పూర్వీకులు బలంగా విశ్వసిస్తున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎ‌వ్వరికీ తెలియదు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 ఈ విషయాన్ని నిరూపించటానికి పురాణాల్లో లేదా చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవట. ఇప్పటికే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధనలు చేసి ఇది తప్పు అని నిరూపించటానికి ప్రయత్నించారు. కానీ ఫలితాలు అంతగా రాలేదు. మొదట..కుక్కలకు ఇలాంటి శక్తులు ఉంటాయి అనే ఓ నమ్మకం గ్రీక్ నుంచి వచ్చిందట. వారు కుక్కలు చావుని గ్రహించగలవు అని నమ్మేవారు. వాళ్లు ఇలా నమ్మకం ఎందుకు పెంచుకున్నారు అనేదానికి కూడా కారణాలు కూడా లేవు.
ఒక అమెరికన్ రచయిత ఏడు గిత్తలు ఉన్న కుక్కలకి దెయ్యాలు కనిపిస్తాయి అని ఓ పుస్తకంలో రాశారు. కుక్క ఏదైనా చీకకటిలోంచి చూసి అరుస్తూ ఉంటే అక్కడ దెయ్యం ఉండే ఉంటుంది అని, ఆ కుక్క రెండు చెవుల మధ్యలో నుండి చూస్తే మనకి కూడా కనిపిస్తుంది అని ఆ రచయిత రాశాడు. దీనిని కొంత మంది అలా ఏముండదు అని కొట్టిపాడేశారు, కానీ కొంత మంది మాత్రం నమ్మారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేదు.. కుక్కలు దెయ్యాలని చూడటం లాంటివేమీ ఉండవనే చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..ఒక వేళ గాలిలో ఏదైనా రసాయనిక మార్పులు వస్తే, ఆ గాలి ఎవరైనా చావుకి దగ్గరగా అంటే తీవ్రమైన అనారోగ్యంగా ఉన్న మనిషికి సోకితే, అదే గాలి కుక్కలకు తెలుస్తుంది.. ఒకవేళ మనిషికి ఏదైనా ప్రమాదం ఉంటే గ్రహించగలుగుతాయి కానీ, చావుని పసిగట్టే శక్తి కుక్కలకి లేదు అని చెప్పారు.