కళ్లకి లెన్స్ పెట్టుకుని స్నానం చేయుచ్చా? అసలు రోజులో లెన్సెస్ ని ఎన్ని గంటలు పెట్టుకోవాలి?

-

కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కుర్చోని పనిచేయటం, అర్థరాత్రి వరకూ ఫోన్లు చూడటం, చిన్నపిల్లల నుంచి జాబ్ చేసే వాళ్లవరకూ అందరికి స్ర్కీన్ తోనే సంబంధం ఉంటుంది. దీనితో రకరకాల కంటి సమస్యలు మొదలవుతున్నాయి. ఈరోజుల్లో చాలమందికి సైట్ సమస్య ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే సహజమైన వెలుతురు కాక కళ్ళు స్క్రీన్స్ నుండి వచ్చే లైట్ ని కూడా చూడవలసి వస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కళ్లను కాస్తైనా కాపాడుకోవచ్చు.

19 గంటల కంటే ఎక్కువ సమయం కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని ఉండడం అస్సలు మంచిది కాదు. మరీ ఎక్కువ సేపు లెన్సెస్ పెట్టుకుని ఉండడం వల్ల విజన్కి పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కళ్ళకి కూడా రెగ్యులర్ గా ఆక్సిజెన్ సప్లై అవసరం. కంటిన్యువస్ గా లెన్సెస్ పెట్టుకుని ఉంటే ఆక్సిజెన్ ఫ్లో ఉండదు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు లెన్సెస్ తప్పక తీసేసి పడుకోండి.

టైట్ ఫిట్టింగ్ స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుంటే తప్ప స్విమ్మింగ్ చేసేప్పుడు లెన్సెస్ తీసేయండి. అలాగే, స్నానం చేసేప్పుడు కూడా లెన్సెస్ తీసేయండి

రాత్రి నిద్రకి ముందు మీ మేకప్ రిమూవ్ చేసినట్లే ఐ మేకప్ కూడా రిమూవ్ చేసి పడుకోండి. మీరు మస్కారాతో, ఐలైనర్ తో నిద్రపోతే అవి కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు ఇరిటేట్ అవుతాయి.

ఎండలో బయటకి వెళ్ళినప్పుడు యూవీ ప్రొటెక్షన్ కలుగచేసే సన్‌గ్లాసెస్ ధరించండి. యూవీ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వలన క్యాటరాక్ట్స్, మాక్యులర్ డీజెనరేషన్ వంటివి సంభవించే అవకాశం ఉంది.సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఉన్నా కూడా సూర్యుని వైపు డైరెక్ట్ గా చూడకండి.

స్క్రీన్ చూసేప్పుడు ఎప్పుడూ మీ కళ్ళు స్క్రీన్ లెవెల్ లో ఉండేలా చూసుకోండి. పైకి చూడడం, కిందకి చూడడం అప్పుడప్పుడూ అయితే ఓకే..కానీ రెగ్యులర్ గా స్క్రీన్ చూసినప్పుడల్లా అలాగే చూడడం మంచిది కాదు.

వర్క్ చేసేప్పుడు కూడా ప్రతి ఇరవై నిమిషాలకీ ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న వాటిని ఇరవై సెకన్ల పాటు చూడండి. దీన్నే 20-20-20 రూల్ అంటారు. కంటిని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఈ రూల్ పాటించడం ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు మర్చిపోతారేమో అనుకుంటే ప్రతి ఇరవై నిమిషాలకీ అలారం పెట్టుకుని అయినా ఈ టిప్ ఫాలో అవ్వండి.

నట్స్, సీడ్స్, పీనట్స్, షెల్‌ఫిష్, పప్పులు, కమలా పండు, స్ట్రాబెర్రీ, బ్రకోలి, క్యాప్సికం, పాలకూర, పీస్, క్యారెట్స్ వంటివి ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోండి.

పొద్దున్న, సాయంత్రం ఇంటికి వచ్చాకా పది పదిహేను సార్లు చల్లని నీరు కళ్ళ మీదకి స్ప్లాష్ చేసుకోండి. బాగా వేడి నీరో, బాగా చల్లని నీరో కళ్ళ మీద చల్లకండి. టెంపరేచర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేయండి. అంటే..మీ శరీరం బాగా వేడిగా ఉంటే చల్లని నీరు కళ్లమీద చల్లుకోకండి. బాడీ నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక మాత్రమే ఇలా చేయాలి.

-triveni

Read more RELATED
Recommended to you

Latest news