సైకిల్ ను ఢీకొంటే కారుకు డ్యామేజవడమేంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. లేదంటే ఆ ఫోటో ఫేక్ కావచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ.. ఆ ఫోటో ఫేక్ కాదు. సైకిల్ ను కారు ఢీకొన్నది నిజం. కారు దెబ్బతిన్నది నిజం. చైనాలోని షెన్‌జెన్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. సైకిల్ ను కారు ఢీకొనడంతో కారు ముందు భాగంలోని బంపర్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సైకిల్‌కు మాత్రం ఏం కాలేదు. కాకపోతే.. సైకిల్ మీద ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఇక.. ఈ ఫోటోను పోలీసులు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో నెటిజన్లు ఆ ఫోటోపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.