మళ్లీ ట్రెండ్‌ అవుతున్న కార్గో ప్యాంట్స్.. మీ దగ్గర ఉన్నాయా..?

-

ఇప్పుడు ట్రెండ్‌ అంటే..మళ్లీ పాతకాలం నాటి స్టైల్స్‌ వాడటమే అయిపోయింది.. 80s, 90s లో ఫాలో అయిన హెయిర్‌ స్ట్రైల్స్‌, అప్పట్లో వేసుకున్న బట్టలు ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌ అవుతున్నాయి.. మీరు గమనించే ఉంటారు.. కార్గో ప్యాంట్లు కూడా మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్నయాి.. ఇంతకుముందు వీటిని వాడేవాళ్లు కాదు.. కానీ ఇప్పుడు ఇవి ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా వీటిని అందరూ వాడేస్తున్నారు.

ఫ్యాషన్‌తో పాటే సౌకర్యం కూడా కావాలనుకునే అబ్బాయిలు వీటిని ఎక్కువగా వాడుతుంటారు.. మీ లుక్‌ని స్టైలిష్‌గా, ట్రెండీగా మారుస్తాయి. కార్గో ట్రౌజర్లు ఇంతకముందులా కాకుండా.. లూజ్ ఫిట్టింగ్‌లో, స్లిమ్ ఫిట్‌లో ఇలా ప్రతి రకంలో వచ్చేశాయి. రోజూవారీ క్యాజువల్ లుక్ కోసం ఇవి చక్కని ఎంపిక.

వీటికుండే మరో ప్రత్యేకత చాలా జేబులు ఉండటం. ఈ ప్యాంట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 60 శాతం పెరిగిందట. త్వరలోనే ఇవి జీన్స్ ప్యాంట్లకి ప్రత్యామ్నాయంగా మారిపోతాయని ఫ్యాషన్‌ నిపుణులు అంటున్నారు.. దానికి కారణం చూడటానికి ఈ ప్యాంట్లు సౌకర్యవంతంగా, ట్రెండీగా అనిపించడమే.

ట్రెక్కింగ్‌కి, టూర్లకి వెళ్లినపుడు, ఆఫీసుకి ఇలా ప్రతి సందర్భానికి ఇవి సరిగ్గా సెట్‌ అవుతాయి.. పాతకాలంలో పని ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా వాడేవారు. ఎక్కువగా జేబులుండటం వల్ల పనికి సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టుకోవడం సులభంగా ఉంటుందని వీటిని వాడేవాళ్లట…

కార్గో ప్యాంట్లు ఇప్పుడు వచ్చినవి ఏం కాదు.. చాలా రోజుల కిందటి ఫ్యాషన్. కానీ ఇప్పుడు వస్తున్న డిజైన్లు మాత్రం కొత్తవి అని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు.. బ్రిటీష్ సైన్యం వీటిని 1930ల్లో తయారు చేసిందట. ఎక్కువ మన్నిక ఉండటంతో పాటు.. మ్యాపులు, చిన్న రవాణా సామగ్రి, పరికరాలు ఈ ప్యాంటు జేబుల్లో పెట్టుకునే వారు. 1990ల్లో వీటిని యువత కూడా వేసుకోవడం మొదలుపెట్టారు.

వీటితో ట్రై చేస్తే మీ లుక్క్ అదిరిపోతుందిగా..

కార్గో ప్యాంట్లలో వస్తున్న స్లిమ్ ఫిట్ ప్యాంట్లు చీనోస్ లాగే వేసుకోవచ్చు. క్యాజువల్ టీషర్ట్, స్నీకర్స్‌తో ఈ ప్యాంట్లు జత చేసుకోవచ్చు. మిలిటరీ ఆకుపచ్చ రంగులో ఉండే ప్యాంట్లను లేదా నలుపు రంగులో ఉండే ప్యాంట్లను ఎంచుకోండి. ట్రెండీ లుక్ ఉంటుంది. వీటి మీదకి ఓవర్ సైజ్డ్ టీ షర్టులు వేసి చూడండి. ఇంకాస్త స్టైలిష్‌గా కనిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news