ఉడుత పచ్చి మాంసం తిన్నారు.. రక్తం కక్కుకొని చచ్చిపోయారు..!

-

ఉడుత కిడ్నీలు, చెస్ట్ భాగం, పిత్తాశయాన్ని అలాగే తినేశారు. అంటే పచ్చిదే తినేశారు. దీంతో కొన్ని రోజులకే వాళ్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో పాటు తీవ్రమైన జ్వరం, తలనొప్పి వచ్చాయట.

ఉడుత మాంసానికి భలే డిమాండ్ ఉంటుంది. ఉడుత మాంసం కొంచమే ఉన్నా.. దాని టేస్ట్ మాత్రం అదుర్స్ అని అంటుంటారు దాన్ని తినే వాళ్లు. అయితే.. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి. ఉడుతలు ఎక్కడున్నాయి.. జీవవైవిధ్యమే పెద్ద ప్రమాదంలో ఉందిప్పుడు. ఇప్పుడు కాదు కానీ.. మన తాతల కాలం నాటి ప్రజలు.. వ్యవసాయానికి వెళ్లినప్పుడు.. కచ్చితంగా ఉడుతలు, పిట్టలను పట్టుకొని తినేవారు. అప్పుడు అవి ఎక్కువగా ఉండేవి. అయితే.. ఉడుత మాంసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఈ విషయాన్నే తెలుసుకున్నట్టున్నారు ఆ దంపతులు. ఏకంగా ఉడుత పచ్చి మాంసాన్నే లాగించేశారు. దీంతో వాళ్లు ప్లేగు వ్యాధి సోకి రక్తం కక్కుకొని మరీ మృతి చెందారు. ఈ ఘటన మంగోలియా, రష్యా సరిహద్దులోని సగనూర్‌లో చోటు చేసుకున్నది.

couple died after eating squirrel raw meat

మంగోలియా బార్డర్ వద్ద సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదట. దీంతో ఎవరో.. ఉడుత మాంసం తినాలని సూచించారట. ఉడుత మాంసం తింటే అనారోగ్యం నయమవుతుందని చెప్పడంతో.. భార్యాభర్తలు ఇద్దరూ ఉడుత పచ్చి మాంసాన్నే తినేశారు. ఉడుత కిడ్నీలు, చెస్ట్ భాగం, పిత్తాశయాన్ని అలాగే తినేశారు. అంటే పచ్చిదే తినేశారు. దీంతో కొన్ని రోజులకే వాళ్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో పాటు తీవ్రమైన జ్వరం, తలనొప్పి వచ్చాయట. తర్వాత.. ఒక్కో అవయవం పనిచేయడం మానేసి.. ఆ వ్యక్తి ఉడుత మాంసాన్ని తిన్న 15 రోజులకే మరణించాడు. తర్వాత కొన్ని రోజులకు అతడి భార్య కూడా మరణించింది. ఆ జంటకు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారట. వాళ్లను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే.. వాళ్లకు నిమోనిక్ అనే ప్లేగు వ్యాధి సోకడం వల్లనే మృత్యువాత పడ్డారని తెలుసుకున్న వైద్యులు.. వాళ్లు నివసించిన చుట్టుపక్కన ప్రజలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్లేగు వ్యాధి.. గాలిలో వ్యాప్తి చెందుతుందని.. దాని వల్ల ఇతరులకు కూడా ఆ వ్యాధి వెంటనే సోకే ప్రమాదముందని.. ఆ ప్రాంత ప్రజలందరినీ వేరే ప్రాంతానికి తరలించారట. కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగానే ఆ ఏరియాను వదిలేసి పారిపోతున్నారు.

పచ్చిమాంసం తినడం చాలా డేంజర్ అని.. దాన్ని తినడం వల్ల చెడు బ్యాక్టీరియా శరీరంలోకి చేరి.. శరీరాన్ని ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తుందని దాని వల్ల.. చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ… 2010 నుంచి 15 మధ్య కాలంలో ప్రపంచం మొత్తంలో సుమారు 3200 మందికి ప్లేగు వ్యాధి సోకితే.. అందులో 584 మంది మృతి చెందినట్లు తెలిపింది. యూఎస్‌లో కూడా ఇప్పటికీ ప్లేగు వ్యాధి కేసులు నమోదవుతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news