యువతి రక్తం కళ్లచూసిన ఆక్టోపస్.. వీడియో

ఓ యువతి.. ఏదో చేద్దామనుకుంది.. ఏదో చేసింది. ఆక్టోపస్‌పై స్టంట్ చేయబోయి అడ్డంగా బుక్కయింది. ఈ మధ్య మొబైల్ వీడియో యాప్స్ బాగా ఫేమస్ అయ్యాయి కదా.. ఈ యువతి కూడా ఏదో ఒకటి చేసి బాగా ఫేమస్ అయిపోవాలనుకుంది. అందుకే… బతికున్న ఆక్టోపస్‌ను తినేయాలనుకుంది. ఆక్టోపస్‌ను తను తింటుండగా వీడియో తీసి దాన్ని వీడియో యాప్స్‌లో షేర్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనుకుంది. కానీ.. తన స్టంట్ బెడిసికొట్టింది.

Octopus attacked woman who wanted to eat it alive

తను తినాలనుకున్న ఆక్టోపసే తన ముఖాన్ని పట్టేసింది. తనను పట్టి అస్సలు వదల్లేదు. ఎంతో కష్టపడి… చివరకు దాన్ని లాగేసింది ఆ యువతి కానీ.. తన చెంపను మాత్రం కొరికినంత పని చేసింది ఆక్టోపస్. రక్తం కళ్ల చూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీపనేదో నువ్వు చూసుకోక.. నీకు ఈ స్టంట్లు అవసరమా? అని నెటిజన్లు ఆ యువతిని విమర్శిస్తున్నారు.