బాబీమే అనే బాలిక కొన్ని రోజులుగా మైగ్రేయిన్ నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆక్యుపంక్షర్ విధానం ద్వారా చెవికి కమ్మ కుట్టించారు. అదే ఆమెకు శాపంగా మారింది.
తన కూతురును అకారణంగా స్కూల్ నుంచి ఇంటికి పంపించింది స్కూల్ యాజమాన్యం. చెవికి కమ్మ పెట్టుకున్నదన్న కారణంతో ఆ బాలికను స్కూల్ నుంచి ఇంటికి పంపించారు. ఆ కారణంతో తన కూతురును ఇంటికి పంపించడం ఏంటని తండ్రి స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. కానీ.. స్కూల్ యాజమాన్యం మాత్రం అస్సలు ఆయన మాట వినలేదు. చెవికి పెట్టుకున్న కమ్మలు తీస్తేనే స్కూల్‌కు అనుమతి ఉంటుందని వాళ్లు తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురయిన ఆ తండ్రి.. స్కూల్ గేటుకు తన రెండు చేతులను బంకతో అతికించి.. వింత నిరసన చేశాడు.
ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. బాబీమే అనే బాలిక కొన్ని రోజులుగా మైగ్రేయిన్ నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆక్యుపంక్షర్ విధానం ద్వారా చెవికి కమ్మ కుట్టించారు. దీంతో ఎప్పటిలాగే ఆ అమ్మాయి స్కూల్‌కు వెళ్లింది. స్కూల్‌కు వెళ్లిన తర్వాత.. బాబీమేకు ఉన్న చెవి కమ్మను గమనించిన టీచర్లు ఆమెను స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. దీంతో తన తండ్రి స్కూల్‌కు వెళ్లి తన కూతురును ఎందుకు ఇంటికి పంపించారంటూ యాజమాన్యాన్ని నిలదీశాడు. తనకు మైగ్రేయిన్ నొప్పి ఉందని.. అందుకే.. ఆక్యుపంక్షర్ విధానం ద్వారా తనకు కమ్మ కుట్టించామని తెలిపినప్పటికీ.. వాళ్లు వినలేదు.
దీంతో.. తన చేతులను స్కూల్ గేట్‌కు గమ్‌తో అతికించుకొని వింతగా నిరసన తెలిపాడు ఆ బాలిక తండ్రి. బాబీమేను స్కూల్‌లోకి అనుమతించేవరకు స్కూల్ నుంచి వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నాడు. అయినప్పటికీ యాజమాన్యం మాత్రం కరగలేదు. అతడి చేష్టలను భరించలేక స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్కూల్‌కు చేరుకున్న పోలీసులు.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు బలవంతంగా అతడిని అక్కడి నుంచి తరలించారు. స్కూల్ యాజమాన్యం కూడా కరునించలేదు. చెవి కమ్మ తీస్తేనే స్కూల్‌కు రావాలని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ తండ్రి సతమతమవుతున్నాడు. రేపు ప్రపంచ తండ్రుల దినోత్సవం కావడంతో.. ఈవార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తండ్రి కూతురు కోసం పడుతున్న తపనకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.