ఫించ్ వీర విహారం.. ఆసీస్ 334/7..

-

లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు సభ్యులు ధాటిగా ఆడారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఫించ్ (132 బంతుల్లో 153 పరుగులు, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించి శ్రీలంక బౌలర్లను పరుగులు పెట్టించాడు. అలాగే స్టీవెన్ స్మిత్ (59 బంతుల్లో 73 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 46 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు ధాటిగా ఆడారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.

అయితే చివరి ఓవర్లలో వికెట్ల టప టపా నేలకూలడంతో ఓ దశలో 350కి పైగా పరుగులు చేస్తుంద‌నుకున్న ఆసీస్ జట్టు అంతకు తక్కువగానే స్కోరు నమోదు చేసింది. కాగా లంక బౌలర్లలో ఇసురు ఉదానా, ధనంజయ డి సిల్వలకు చెరో 2 వికెట్లు దక్కగా, లసిత్ మలింగకు 1 వికెట్ దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news