పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా..? శుభమేనా..?

-

మనిషి నిద్రపోతున్నప్పుడు కలలో ఏవేవో వస్తువులు, మనుషులు కనిపించడం సహజం.. కొన్నిసార్లు మనం తింటున్నట్లు కూడా కలలు వస్తాయి.. నిజ జీవితంలో మనకు అసలు ఇష్టమే ఉండవు… కానీ కలలో తింటుంటాం.. మీకు ఎప్పుడైనా కలలో పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా..? కలలో పాలు కనిపిస్తే శుభ సూచకం అంటుంటారు. పాలు రకరకాలుగా కనిసిస్తే మంచిది. పాలు కనిపిస్తే ఏంటి సంకేతం మనం ఇప్పుడు చూద్దాం.

స్వప్న శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి కలలో పాలు తాగడం లేదా అవి పడిపోవడం కనిపిస్తే శుభసూచకమని లేదా అది ఆరోగ్యానికి సూచన అని సంకేతమట. శాస్త్రాన్ని అనుసరించి పాలు లక్ష్మీ స్వరూపం. కలలో పాలు కనిపిస్తే దానికి వివిధ రకాల అర్థాలుంటాయి.

కలలో పాలు తాగితే
కలలో మీరు పాలు తాగుతున్నట్టు వస్తే అది చాలా శుభప్రదం. కలలో పాలు తాగడం అనేది మీ పురోబివృద్ధికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతుంది. సమీప భవిష్యత్తులో మీ కేరీర్‌లో మంచి విజయాలు సాధించబోతున్నారనేందుకు ఈ కల ఒక సందేశంగా భావించవచ్చు.

పాలు కొంటున్నట్టు
స్వప్న శాస్త్రాన్ని అనుసరించి పాలు కొంటున్నట్టు కల వస్తే అది మంచి ఆరోగ్యానికి సంకేతం. దీర్ఘకాలికంగా ఆనారోగ్యంతో ఉన్న వారికి పాలు కొంటున్నట్టు కల వస్తే అది చాలా శుభ సంకేతం. త్వరలో వారు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పే సందేశంగా భావించవచ్చట.

కలలో పాలు విరిగితే
మీరు కాస్తున్న పాలు విరిగిపోయినట్టుగా కల వస్తే అది మాత్రం శుభప్రదం కాదు. కలలో పాలు విరిగిపోతే రాబోయే కష్టకాలానికి సూచన. జీవితంలో ఏదో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని అనేందుకు సంకేతం. ఆర్థిక లేదా సామాజిక లేదా ఏదైనా కెరీర్‌కు సంబంధించి ఇబ్బందుల్లో పడనున్నారని అర్థం.

పాలు పితుకుతున్నట్టు
మీకు కలలో ఆవు పాలు పితుకుతున్నట్టు కల వస్తే అది చాలా శుభప్రదమైన కల. త్వరలో మీ జీవితంలోకి ఆనందం, సమృద్ధి రానున్నాయని చెప్పే సంకేతం. అంతేకాదు చాలా పెద్ద మొత్తంలో మీకు ధనం చేతికంద బోతోందని ఈ కల సందేశాన్నిస్తుంది.

కాగుతున్న పాలు
కలలో పాలు కాస్తున్నట్టు కనిపిస్తే అది కూడా శుభసూచకమే. మరుగుతున్న పాలు శుభవార్తలు వింటారని అనడానికి సంకేతం అని పండితులు అంటున్నారు.. త్వరలో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అనేందుకు సంకేతం. అంతేకాదు పాలలో చక్కెర కలుపుతున్నట్టు కనిపస్తే త్వరలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారని అనేందుకు ఇదొక సందేశంగా భావించాలి.

Read more RELATED
Recommended to you

Latest news