కన్నాకు సత్తెనపల్లి పగ్గాలు..కోడెల వారసుడుకు అన్యాయం.!

-

మరి మంత్రి అంబటి రాంబాబుకు అన్నీ తెలిసే మాట్లాడారా? లేక ఆయనకు తనపై పోటీ చేసే ప్రత్యర్ధి ఎవరు అనేది సమాచారం వచ్చిందో గాని..తాజాగాగానే తనపై పోటీకి చంద్రబాబు..కొత్త వస్తాదుని బరిలో దించుతున్నారని చెప్పుకొచ్చారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే అంబటి ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లి నియోజకవర్గానికి టి‌డి‌పి ఇంచార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని నియమించారు. దీంతో సత్తెనపల్లి పోరు రసవత్తరంగా మారనుంది. అటు అంబటి కాపు వర్గమే..ఇటు కన్నా కాపు వర్గమే.

సత్తెనపల్లిలో కాపు వర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉండనుంది. దీంతో కాపులు ఎటువైపు ఎక్కువ తిరుగుతారో చూడాలి. మొత్తానికి సత్తెనపల్లి బరిలో కన్నా పోటీ చేయడం ఖాయమైంది. అయితే గతంలో పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కన్నాకు..సత్తెనపల్లిపై కూడా మంచి పట్టుంది. ఇటీవలే బి‌జే‌పి నుంచి టి‌డి‌పిలోకి వచ్చిన ఆయనకు మొదట గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారనే ప్రచారం వచ్చింది.

కానీ ఆ మధ్య ఇదేం ఖర్మ కార్యక్రమానికి చంద్రబాబు సత్తెనపల్లికి వచ్చినప్పుడు ఆయన వెంటే కన్నా కూడా ఉన్నారు. అప్పుడే సత్తెనపల్లి కన్నాకు అని తేలిపోయింది. అయితే ఈ సీటు దివంగత కోడెల శివప్రసాద్..వరుసగా నరసారావుపేటలో అయిదుసార్లు గెలిచి..2014లో సత్తెనపల్లికి మారి గెలిచిన కోడెల..2019లో ఓడిపోయారు. తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

దాని తర్వాత సత్తెనపల్లికి కొత్త లీడర్‌ని పెట్టలేదు. కానీ కోడెల వారసుడు శివరాం సీటు కోసం ట్రై చేశారు. కాకపోతే ఆయన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ట్రై చేశారు. ఇంకా కొందరు నేతలు సీటు కోసం ట్రైక్ చేశారు. వారిని కాదని కన్నాకు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు కోడెల వారసుడుకు అన్యాయం చేశారని, ఆయన వర్గం అంటుంది. ఈ క్రమంలో బాబు..కోడెల శివరాంకు వేరే సీటు ఇస్తారా? లేదా వేరే పదవి ఏమైనా ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news