ఈ తెగ‌లో హ‌త్య నేరం కాదు.. సెక్స్‌కు ప‌ట్టింపుల్లేవు

-

వీళ్ల వేషధారణ, ఇతర ఆచార వ్యవహారాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆ తెగ గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తుంటారు.
దాదాపు 10 వేల జనాభా ఆ తెగది. వీళ్లు కొండల మీద నివాసముంటారు. కొన్ని గ్రామాల సమూహం ఈ తెగ.

ప్రపంచంలో ఎన్నో ఆదివాసీ తెగలు ఉంటాయి. ఆదివాసీలు ఎక్కువగా అడవుల్లో ఉంటారు. సాధారణంగా ప్రజల ముందుకు రారు. వీళ్లు కూడా మనుషులే అయినప్పటికీ.. బాహ్య ప్రపంచంతో వీళ్లకు సంబంధం ఉండదు. వీళ్లది ఓ లోకం. వాళ్ల రూల్స్ వాళ్లకే. అయితే.. మన ఆంధ్రాకు సరిహద్దులో ఒడిశాలో ప్రపంచంలోనే చాలా అరుదైన తెగ ఒకటి ఉంది అనే విషయం మీకు తెలుసా? పదండి వాళ్ల ఆచారాలేంటో తెలుసుకొని వద్దాం.

ఆంధ్రా, ఒడిశా బార్డర్ లో ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో ఉంటారు వీళ్లు. ఈ తెగను రీనోలు అంటారు. బోండాలు అని కూడా పిలుస్తారు. వీళ్ల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. వీళ్లు బోండీ అనే భాష మాట్లాడుతారు. పోడు వ్యవసాయంతో పాటు కొండ చీపుర్లు, ఇతర వస్తువులను అమ్మడం వీరి ప్రధాన వృత్తి. వాటిని మల్కన్ గిరి జిల్లాలోని ఒనకడిల్లీలో జరిగే సంతలో అమ్ముతుంటారు. అక్కడే వాళ్లకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు.

అయితే.. వీళ్ల వేషధారణ, ఇతర ఆచార వ్యవహారాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆ తెగ గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తుంటారు.

దాదాపు 10 వేల జనాభా ఆ తెగది. వీళ్లు కొండల మీద నివాసముంటారు. కొన్ని గ్రామాల సమూహం ఈ తెగ. ఈ తెగలో మహిళలదే అధికారం. ఇంటి వ్యవహారాలతో పాటు.. అన్నింటిలో మహిళే చూసుకుంటారు.

విచిత్ర వేషధారణ

ఈ తెగ వ్యక్తుల వేషధారణ విచిత్రంగా ఉంటుంది. మగ అయినా ఆడ అయినా వెరైటీగా ఉంటాయి వాళ్ల డ్రెస్సులు. అమ్మాయిలైతే పూసలదండలు, పట్టీలు, రింగులు పెట్టుకుంటారు. యుక్త వయసు రాగానే గుండు చేయించుకుంటారు.

తమకన్నా చిన్నవాళ్లను పెళ్లి చేసుకునే యువతులు

ఈ తెగ ప్రజల్లో యువతులు తమ కన్నా చిన్నవాళ్లను పెళ్లి చేసుకుంటారు. తమ కన్నా చిన్నవాళ్లు అయితే వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటారని వాళ్ల నమ్మకం. ఇక.. పెళ్లికి ముందు ఈ తెగలో సెక్స్ కు సంబంధించి ఎటువంటి పట్టింపులు ఉండవు. తమకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కు వాళ్లకు ఉంటుంది. వాళ్లతో కలిసి కొన్నిరోజుల ఏకాంతంగా గడుపుతారు. ఆసమయంలో సెక్స్ కూడా చేసుకుంటారు. ఈ విషయాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోరు. సెక్స్ అనేది వాళ్లకు చాలా కామన్ విషయం. వాళ్లకు ఎవరైనా నచ్చితే మాత్రం పెళ్లి కూడా చేసుకుంటారు.

(Courtesy by BBC TELUGU)

Read more RELATED
Recommended to you

Latest news