బ్రేకప్ అయిందా..? ఈ విషయాల్లో తొందర వద్దు..!

-

ప్రేమలో అందరూ సక్సెస్ అవ్వలేరు కొందరు ప్రేమించిన వ్యక్తితో కలకాలం కలిసి ఆనందంగా జీవిస్తే కొందరు మధ్యలోనే ప్రేమించిన వాళ్ల నుండి దూరంగా వెళ్లి పోవాల్సి ఉంటుంది. అందరికీ అనుకున్నంతగా ప్రేమ లో సక్సెస్ రాదు. ఎప్పుడూ కూడా ఎవరితోనైనా కలవాలన్నా విడిపోవాలన్నా కూడా తొందరపాటు వద్దు కాసేపు ఆలోచించి ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోండి. రిలేషన్షిప్ విషయంలో అస్సలు తొందర పనికిరాదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వలన అపాయమే కలుగుతుంది.

చాలామంది బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్లీ ఏదో ఒక రిలేషన్ షిప్ లో ఉండాలని ఆ బ్రేకప్ ని మర్చిపోవడానికి తొందరగా మరొకరితో ప్రేమలో పడిపోతారు. కానీ నిజానికి కాసేపు మనసుకి రెస్ట్ ఇవ్వాలి తర్వాత నెమ్మదిగా రిలేషన్షిప్ లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్రేకప్ తర్వాత ఎవరితో అయితే విడిపోయారో వాళ్ళ మీద మీకు ఎక్కువ కోపం వస్తుంది. ఎలా అయినా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చాలామంది భావిస్తారు కానీ కోపం అదుపులో ఉంచుకోండి. మానసిక వేదనని ఇతరులపై రుద్దకండి దీనివల్ల ప్రమాదం ఉంటుంది.

అలానే కోపంలో చాలామంది మాటలు జారిపోతూ ఉంటారు దీని వలన వాళ్ళ మనసు బాధపడుతుంది పైగా మీరు కూడా తర్వాత ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి బ్రేకప్ తర్వాత ఈ తప్పును కూడా చేయొద్దు. కొంతమంది భార్యాభర్తలు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాలని అనుకుంటూ ఉంటారు అయితే ఏదైనా మాట్లాడాలని అనుకుంటే పిల్లల్ని పావుల్లా వాడతారు అలా చేయకండి.

బ్రేకప్ అయిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో వారి యొక్క ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం తప్పుగా పోస్టులు పెడుతూ ఉంటారు అది కూడా చేయకండి. బ్రేకప్ తర్వాత ఏదో జీవితమే పోయిందని చాలామంది ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. కొందరైతే మద్యం సేవిస్తూ ఉంటారు అయితే ఇటువంటి తప్పులు చెయ్యద్దు. దీన్ని వలన మీ ఆరోగ్యం పాడవుతుంది మానసిక సమస్యలు ఎదుర్కోవాలి. కాబట్టి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకండి బ్రేకప్ అయిన తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news