పల్లెల్లో ఉంటూనే ఈ వ్యాపారం చేయండి.. నెలకు లక్ష ఆదాయం..!!

-

వ్యాపారం చేయడానికి పట్టణాలు, నగరాలు మాత్రమే అనుకూలం అని చాలా మంది అనుకుంటారు..కానీ పల్లెల్లో కూడా చేయగలిగిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు ఉన్నచోటే ఈ బిజినెస్‌ చేస్తూ.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.. నిజానికి ఈ వ్యాపారాలు చేయడానికి పల్లెలే అనుకూలం..ఇంకెందుకు ఆలస్యం.. ఆ బిజినెస్‌ ఐడియాలు ఏంటో చూద్దామా..!

 

పల్లెలు వ్యవసాయానికి పట్టు కొమ్మలు.. ఇక్కడున్న జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో రైతులదే కీలక పాత్ర. అందుకే ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి సంబంధించి అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా ఖర్చుల భారం తగ్గి.. ఎక్కువ లాభాలు పొందవచ్చు.దేశంలో జనాభా పెరుగుదలతో పాటు పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను పెద్ద పెద్ద కంపెనీలు తీర్చలకేపోతున్నాయి.. అందువల్ల మీరు కూడా మీ గ్రామంలో డైయిరీ ఫామ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. 10 ఆవులు, గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. మంచి నాణ్యమైన పాలను అమ్మితే.. మంచి ధర కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఆవు, గేదెల పేడను పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతో డెయిరీ ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించి.. మంచి ఆదాయం పొందవచ్చు. మొదట్లో కాస్త కష్టపడితే మన ఉత్పత్తుల గురించి జనాలకు తెలిస్తే చాలు.. క్వాలిటీ మెయింటేన్‌ చేస్తే లాభాలు అవే వస్తాయి..

ఇక రెండు ఐడియా.. ఇప్పుడు ఎక్కడ చూసినా పురుగుల మందులు, రసాయానాలతో పండించిన పంటలే ఉంటున్నాయి.. జనాలకు వీటిమీద అవగాహన పెరిగింది.. సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టిసారిస్తున్నారు. ఆర్గానిక్‌గా పండించిన పంటలను కొనేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు..ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నాయి. మీరు వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను ప్రారంభిస్తే..మంచి లాభాలు వస్తాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు, రాయితీలు, ఆర్థిక గ్రాంట్లు కూడా ఇస్తాయి.

ఇక మూడో ఐడియా.. బైకరీ ఉత్పత్తులు.. పట్టణాల్లో బేకరీ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మీరు కూడా బేకరీని ఏర్పాటు చేస్తే.. అద్భుతమైన రాబడి వస్తుంది. ఈ వ్యాపారం ఎప్పుడూ విఫలమవదు. లక్షల్లో కూడా లాభాలు వస్తాయి. పోషకమైన ధాన్యాలు, పప్పులు, వాటి పిండి తయారీ యూనిట్‌తో కలిపి బేకరీ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ఇండస్ట్రీ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద కూడా ఆర్థిక సహాయం తీసుకోవచ్చు.

ఈ మూడింట్లో ఏది చేసినా మంచి లాభాలే వస్తాయి.. అయితే చెప్పుకున్నంత ఈజీగా ఏదీ ఉండదు.. కష్టపడాలి.. కష్టపడకుండా ఏదీ మనకు అంత సులభంగా దక్కదు..! లాభనష్టాలు బేరీజు వేసుకుని మీకు ఓకే అనుకుంటే వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news