వేసవి సెలవల్లో ఈ టూర్ వేసేయండి.. పిల్లలతో ఎంజాయ్ చేసేయచ్చు..!

-

Tour: మీ పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేసాక ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఇవే బెస్ట్ ప్లేసెస్. వెళ్లి ఎంచక్కా పిల్లలతో పాటుగా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. మన ఇండియాలోనే ఈ ప్రదేశాలు ఉన్నాయి చక్కగా ఫ్యామిలీతో పాటుగా ఈ ప్రదేశాలకి వెళ్లి వచ్చేయొచ్చు. మరి ఇక ఈ ప్రదేశాల గురించి చూసేద్దాం.

Tour
Tour

ఫ్లవర్ వ్యాలీ, సిక్కిం:

ఫ్లవర్ వ్యాలీ, సిక్కిం చూడదగ్గ ప్రదేశం కచ్చితంగా పిల్లలకి ఈ ప్రదేశం నచ్చుతుంది చక్కటి పూలతో ఈ ప్రదేశం చూడడానికి అందంగా ఉంటుంది. చాలా హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎంచక్కా ఈ ప్రదేశానికి వెళ్లి మీరు వచ్చేయొచ్చు.

పహాల్గం, కాశ్మీర్:

వేసవిలో ఏదైనా మంచి ప్లేస్ కి మీరు వెళ్లాలనుకుంటే ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. ఇది చాలా బాగుంటుంది ఎత్తైన కొండలు ప్రకృతి అందర్నీ ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటుగా ఎంచక్కా మీరు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసేయొచ్చు.

లేహ్, లడక్:

ఇది కూడా చాలా మంచి ప్రదేశం సమ్మర్ లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇది కూడా బెస్ట్ ప్లేస్. ఇక్కడికి కూడా వెళ్లి ఎంచక్కా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. పిల్లలతో ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్లాలనుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

మన, ఉత్తరాఖండ్:

ఇది కూడా చాలా మంచి ప్రదేశం ఇక్కడకి కూడా చాలామంది వేసవిలో వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఎంచక్కా ప్రకృతి నడుమ మీరు ఫొటోస్ ని తీసుకోవచ్చు. సరదాగా గడపచ్చు.

చంద్రభాగ బీచ్ ఒడిశా:

మీ పిల్లలు కాస్త ఎదిగిన పిల్లలైతే ఈ ప్రదేశం పర్ఫెక్ట్ గా ఉంటుంది అడ్వెంచర్స్ స్పోర్ట్స్ వాళ్ళని బాగా ఆకట్టుకుంటాయి. ఫిషింగ్ వంటివి ఇక్కడ ఉంటాయి.

కుమరకొం కేరళ:

అందమైన కొబ్బరి చెట్లు మధ్య ఈ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ యాలకులు మిరియాలు వంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ చేయొచ్చు. ఎంచక్కా సమ్మర్ లో పిల్లలతో పాటుగా ఈ ప్రదేశాలకి వెళ్లి సరదాగా గడపొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news