నల్లతాడు కాలికి కట్టుకునే అలవాటు మీకూ ఉందా.. ఈ రాశి వారికే అది మేలట!

-

ఒకప్పుడు అమ్మాయిల కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు.. గల్‌గల్‌మని సౌండ్‌తో ఇళ్లంతా తిరుగుతుంటే..లక్ష్మీదేవి నడుస్తున్నట్లే ఉంటుందని పెద్దోళ్లు తెగ సంబరపడేవారు.. కాలం మారింది..కాళ్లకు పట్టీలు పోయి.. నల్లతాళ్లు వచ్చాయి. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా.. అందరూ ఎడమకాలుకి ఒక నల్లతాడుని కట్టుకుంటున్నారు. కొందరు స్టైల్‌ కోసం కట్టుకుంటే.. మరికొందరు దిష్టితగలకుండా కడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నల్లతాడు కట్టడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయట.. ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు అలా తాడు కట్టుకోకూడదని శాస్త్రం చెబుతుంది.. ఈ నల్లతాడు కథేంటో, ఎక్కడ నుంచి స్టాట్‌ అయిందో మొత్తం చూద్దామా..!
ఉత్తరప్రదేశ్‌లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందట. కొంతమందికి కాళ్లలో నొప్పి ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి వస్తుంది. అలాంటి వారు కూడా నల్లతాడు కట్టించుకుంటారు. కాళ్లే కాదు… చేతులు, మెడ, నడుముకి కూడా నల్లతాళ్లు కట్టించుకుంటారు. నలుపుకి… చెడును లాగేసుకునే శక్తి ఉందని అందరూ బలంగా నమ్ముతారు. అందువల్ల కాళ్లకు నల్లతాడు ఉంటే… దిష్టి మొత్తాన్నీ అది లాగేసుకొని… మేలు చేస్తుందని జనాల మాట.
జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ తాడు కడతారు. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ, డబ్బు వస్తుందని పండితులంటున్నారు. వ్యక్తులకే కాదు… వారు ఉండే ఇంట్లో కూడా డబ్బు కొరత ఉండదని చెబుతారు.
నల్లతాడును కట్టే ముందే దానికి 9 ముడులు వేస్తారు. ఆ తర్వాతే కడతారు. ఈ తాడు కట్టిన చెయ్యి లేదా కాలుకు మరే రంగు తాడునూ కట్టకూడదని నియమం ఉంది. నల్ల తాడు కట్టుకున్నాక.. రోజూ రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించాలనీ… తద్వారా ఈ తాడు మరింత శక్తిమంతం అవుతుందట.
నల్ల తాడు, నల్ల రంగు… ధనస్సు (Capricorn) తుల (Libra), కుంభ (Aquarius) రాశి వారికి మేలు చేస్తాయి. ఈ రాశి చక్రాల్లో పుట్టిన వారు ఎలాంటి అనుమానాలూ లేకుండా నల్లటి వస్త్రాలు, నల్లటి తాళ్లను ధరించవచ్చు.
అదే వృశ్చికరాశి (Scorpio), మేష (Aries) రాశిలో పుట్టిన వారికి నల్ల రంగు కలిసి రాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం… మార్స్ (అంగారక లేదా కుజ లేదా అరుణ గ్రహం) ఈ రెండు రాశులనూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల నలుపు వీరికి మంచిది కాదట. వీరు నలుపు తాళ్లు ధరిస్తే… వీరి మనసులో అనిశ్చితి ఏర్పడుతుంది. జీవితాలు ప్రమాదంలో పడతాయని పండితులు అంటున్నారు.
కొందరు ఇలాంటివి విపరీతంగా నమ్ముతారు.. మరికొందరు లైట్‌ తీసుకుంటారు. మనం దేనికైతే భయపడతామో దాన్నే ఎక్కువ నమ్ముతాం. శాస్త్రం కాసేపు పక్కన పెడితే.. సైన్స్‌ ప్రకారం కూడా.. నలుపు నెగిటివ్‌ ఎనర్జీని తీసుకుంటుంది.!

Read more RELATED
Recommended to you

Latest news