బొడ్డులో మీకు కాటన్‌ తరహాలో ఏదైనా ఉందా..? కారణం ఇదే..!

-

బొడ్డు: స్నానం చేయడం అంటే.. బాడీ మొత్తం నీళ్లతో తడిపేసి.. సోప్‌వేసి రెండు సార్లు రుద్దేస్తే సరిపోతుంది అనుకుంటారు.. కానీ మీరు సరిగ్గా స్నానం చేయకపోతే.. చెవుల వెనుక, మెడ దగ్గర, బొడ్డులో మురికి అలానే ఉండిపోతుంది. ముఖ్యంగా చాలామంది బొడ్డులో నల్లగా ఉంటుంది. కొందరికి బొడ్డు లోతుగా ఉంటుంది. అలాంటి వారిలో బొడ్డులో డస్ట్‌ బాగా పేరుకుపోతుంది. మీరే గమనించుకోండి.. మీ నాభిలో నల్లగా ఉంటే మీరు సరిగ్గా స్నానం చేయనట్లే.. ఇంతకీ ఈ నల్లగా, కాటన్‌లా ఉండే పదార్థం ఏంటి..? అది ఏమైనా వైరసా, ఇన్ఫెక్షనా..?

బొడ్డు
బొడ్డు

 

బొడ్డు వద్ద వెంట్రుకల పెరుగుదల భిన్నంగా ఉంటుంది. దీని వల్ల బొడ్డులోకి అనేక చిన్న చిన్న పదార్థాలు ఆకర్షితమవుతాయి. మనం ధరించే దుస్తులకు చెందిన పోగులు, రాత్రి కప్పుకునే దుప్పట్లు, ఇతర బెడ్‌ షీట్లకు చెందిన పోగులు, మృత చర్మ కణాలు, దుమ్ము, కొవ్వు కణాలు అన్ని చిన్న పదార్థాల రూపంలో బొడ్డు వైపుకు ఆకర్షించబడతాయి. దీంతో బొడ్డులో వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి కాటన్‌లా కనిపిస్తాయి. దీన్ని fluff లేదా lint అంటారు.

అయితే బొడ్డు వద్ద వెంట్రుకల పెరుగుదల జరిగితే ఆ వ్యర్థాలు అవే ఆటోమేటిగ్గా తొలగిపోతాయి. కానీ కొందరిలో అలా జరగదు. అలాంటి వారు బొడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి బొడ్డులో నువ్వుల నూనె వేసి కాసేపు ఉంచితే.. బొడ్డులో పేరుకుపోయిన మట్టి అంతా నానిపోయి వస్తుంది..దీంతో బొడ్డు శుభ్రమవుతుంది. ఎప్పటికప్పుడు ఇలా చేస్తుంటే వ్యర్థాలు పేరుకుపోవు.

ఇక పాత దుస్తుల నుంచి చిన్న చిన్న పోగులు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని తక్కువగా ధరించాలి. లేదంటే వాటి నుంచి వచ్చే పోగులు బొడ్డులో పేరుకుపోతాయి. అలాగే చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దీంతో మృత కణాలు పోతాయి. అవి బొడ్డులో పేరుకుపోవు. బొడ్డు శుభ్రంగా ఉంటుంది.

బొడ్డులో ఆయిల్‌ వేసి మసాజ్‌ చేయడం వల్ల మీ శరీరంలో ఉండే ప్రతి నరం ఉత్తేజం అవుతుంది. మొత్తం శరీరంలో నరాలను బొడ్డు అనుసంధానం చేస్తుంది. బొడ్డులో ఆవ నూనె వేసి మసాజ్‌ చేస్తే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి తెలుసా..!

Read more RELATED
Recommended to you

Latest news