ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఏంటో తెలుసా..?

-

ఖరీదైన కూరగాయలంటే.. ఇప్పటి వరకూ మనకు ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌, Broccoli లాంటివే తెలుసు.. ఇవి మాములు వాటితో పోలిస్తే కాస్ట్‌ ఎక్కువే కానీ మరీ పది వేలు పైన అయితే ఉండవు.. కానీ ఇప్పుడు చెప్పుకునే కూరగాయను కానీ మీరు కొనలాంటే.. 85వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే.. నెలజీతం కూడా సరిపోదు కదా..! ఆ కూరగాయ పేరు హాప్ షూట్స్‌..నిజంగా ఇది తినాలంటే ధనవంతులై ఉండాల్సిందే..!
హాప్ షూట్‌లు అంటే ఏమిటి?
శాస్త్రీయంగా వీటిని హ్యూములస్ లుపులస్ అని పిలుస్తారు. ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు. ఈ పంట చేతికి రావాలంటే మూడేళ్లు పడుతుందట.. హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు E, B6, C ఉంటాయి. అపారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం. అందుకే ఈ కూరగాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా..
క్షయవ్యాధికి …
ఈ కూరగాయలో క్షయవ్యాధికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టించే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు..TB అనేది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని తెలిసిన విషయమే…ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు హాప్ షూట్స్ సహాయపడతాయి.
జీర్ణక్రియకు…
ఇది జీర్ణక్రియ చురుగ్గా మార్చుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. తిన్న ఆహారం చక్కగా అరిగితేనే శరీరం శక్తిని, ఖనిజాలు, విటమిన్లను శోషించుకోగలదు.
నిద్రలేమికి .
ఇది ఎంత పెద్ద సమస్యో..అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి. హాప్ షూట్స్ పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఔషధాలలో ఉపయోగిస్తారు.
చర్మ సమస్యలకు..
హాప్ షూట్స్ పువ్వులు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మంపై ఉన్న మచ్చలు పోతాయి. చర్మంపై దద్దుర్లు, దురదలను పొగొడుతుంది.
మనదేశంలో దీన్ని సాగు చేయడం లేదు, కానీ ఒకసారి హిమాచల్‌ప్రదేశ్లో నాటినట్లు సమాచారం. అలాగే బీహార్‌కు చెదిన అర్నేష్ సింగ్ అనే రైతు కూడా వీటిని పండించారట… కానీ వాటిని పండించడానికి అధిక వ్యయం అవుతుండడంతో పండించడం ఆపేశారు. అందుకే మన దేశంలో ఈ కూరగాయ దొరకదు.

Read more RELATED
Recommended to you

Latest news