మనదేశంలో ఉరిశిక్షను ఉదయం 4 గంటలలోపే ఎందకు అమలుచేస్తారో తెలుసా..?

-

చేసిన తప్పు మితిమీరితే..దానికి జైలుశిక్ష కంటే ఉరిశిక్షే మార్గమని జడ్జి నిర్ణయించినప్పుడు ఆ ఖైదీకి ఉరిశిక్షను విధిస్తారు. అయితే ఉరిశిక్షను విధించే ముందు కొంత ప్రొసీజర్ ఉంటుంది. వాటి గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. మనకు సినిమాల్లో మాత్రం ఉరిశిక్ష విధించే ఖైదీకి ముందురోజు రాత్రి ఇష్టమైన భోజనం పెడతారని. కానీ ఇంకా చాలానే ఉంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిందితుల‌కు ఉరిశిక్ష‌ను మ‌న దేశంలో తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు అమ‌లు చేస్తారు. ఎందుకంటే ఆ స‌మయంలో జ‌నాలంద‌రూ నిద్ర‌పోతుంటారు. ప్ర‌శాంతంగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌దు అని ఆ స‌మ‌యంలోనే ఉరిశిక్ష‌ను అమ‌లు చేస్తారు.

ఉరిశిక్ష ప‌డ్డ ఖైదీల‌ను శిక్ష విధించే రోజు ఉద‌యం 3 గంట‌ల‌కు నిద్ర‌లేపుతారు. వారు నిత్యం చేసే ప‌లు కార్య‌క్ర‌మాలు ముగించాల్సి ఉంటుందట.
ఉరిశిక్ష నిందితుల‌కు త‌మ ఇష్టం వ‌చ్చిన నీటితో స్నానం చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. వేడినీరు, చ‌ల్ల‌నినీరు ఏదైనా స‌రే వాళ్లు అడిగింది అంద‌జేస్తారట.

నిందితుల‌కు ఇష్ట‌మైన ఆహారం ఏదో క‌నుక్కుని ముందు రోజే సిద్ధం చేసి ఉంచుతారు. దాన్ని ఉరి తీసేముందు నిందితుల‌కు అంద‌జేస్తారు.  ఇష్ట‌మైన ఆహారం తిన్నాక కొంత స‌మ‌యం ఒంట‌రింగా ఉండేందుకు అనుమ‌తిస్తారట. ఆ స‌మ‌యంలో నిందితులు త‌మ కుటుంబ స‌భ్యుల‌ను త‌ల‌చుకోవ‌చ్చు. వారి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకోవ‌చ్చు. లేదా ఇష్ట‌మైన పుస్త‌కం చ‌ద‌వ‌వ‌చ్చు. మ‌రే ఏప‌నైనా చేయొచ్చు. ఒక మనిషికి చావు తెలిసి రావటం అనేది దురదృష్టకరం. అలా తనను ఇంకొద్ది సేపట్లో ఉరితీస్తున్నారు అని తెలిశాక..ఏం తినాలనిపిస్తుంది. ఏంత కరుడుకట్టిన నేరస్తుడైనా ఆ క్షణంలో కచ్చితంగా బాధడతారు.

దైవం మీద న‌మ్మ‌కం ఉన్న‌వారికైతే ఆధ్యాత్మిక పుస్త‌కాలు అంద‌జేస్తారట. వాటితో ప్రార్థ‌న‌లు చేసుకోవ‌చ్చు. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకునేందుకు అవ‌కాశం కల్పిస్తారు.

డాక్ట‌ర్ చేత ఉరితీత నిందితుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేస్తారు. నిందితులు అన్ని విధాలుగా అంటే మాన‌సికంగా, శారీర‌కంగా ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు చెబితేనే ఉరి తీస్తారు. ఈ విషయం మనకు సినిమాల్లో చూసే ఉంటాం.

hanging

న్యాయ‌మూర్తి నిందితులు చేసిన నేరాల‌ను, వారికి ప‌డ్డ శిక్ష‌లు, ఇత‌ర వివ‌రాల‌ను వారి పేర్ల‌తో స‌హా సంక్షిప్తంగా చ‌దివి నేర‌స్థుల‌కు వినిపిస్తారు. అవ‌స‌రం అయితే నిందితుల‌కు త‌మ మాతృభాష‌లో స్పష్టంగా అర్థమయ్యేలా చదివి వినిపిస్తారు. అంటే చనిపోయేముందు తన చేసిన నేరం ఏంటి అనేది వాళ్లుకు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు.

న్యాయ‌మూర్తి నేరస్థుల వివ‌రాల‌ను చ‌దివి వినిపించి వెంట‌నే అధికారుల‌కు సైగ చేస్తారు. దీంతో ఉరి అమ‌ల‌వుతుంది.
నిందితుల మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తారు. వారికి ఉరితీసిన త‌లారి వివ‌రాల‌ను బ‌య‌టకు వెల్ల‌డించ‌రు. వాళ్లను చంపినందుకు కుటుంబసభ్యులు ఏదైనా కక్షసాధింపుగా చేస్తారనే ఉద్దేశంతోనే తలారి వివరాలు బయటకు చెప్పరు.

ఈ విధంగా ఉరిశిక్ష అమలవుతోంది. మనదేశంలో చాలావరకూ కఠినకారాగార శిక్షనే అమలు చేస్తారు కానీ..ఉరిశిక్ష వరకూ వెళ్లరూ. ఇక ఆ నేరస్తులు చేసిందానికి ఉరిశిక్షే తీర్పు అని భావించనప్పుడే ఉరిశిక్ష విధిస్తారు. ఇంకోటి..ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన జడ్డీ తన పెన్ను నిబ్ విరిచేస్తాడు. ఎందుకంటే ఉరిశిక్ష తీర్పురాసిన పెన్నుతో మరెవరకి తీర్పు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అలా చేస్తారట.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news