హైదరాబాద్ నుండి ఊటీ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే IRCTC ప్యాకేజీని చూడండి..!

-

మీరు ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? శీతాకాలంలో ఊటీ చూడడానికి చాలా బాగుంటుంది. దక్షిణ భారత దేశంలోనే అందమైన హిల్‌స్టేషన్ ఇది. ఎంచక్కా మీరు ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ తో కానీ ఈ టూర్ వేసేయచ్చు. శీతాకాలంలో ఊటీ వెళితే చాలా అందంగా ఉంటుంది. పైగా ఎంతో బాగుంటుంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ వివరాలని చూస్తే..

ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుండి ఊటీ కి ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. జనవరి 17 నుంచి ఆరు రోజుల పాటు ఈ టూర్ ఉండనుంది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. జనవరి 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. నెక్స్ట్ డే 8 గంటలకి కోయంబత్తూర్‌ వెళ్లారు. అక్కడ నుండి ఊటీకి తీసుకు వెళ్తారు.

మధ్యాహ్నం బొటానికల్ గార్గెన్స్, ఊటీ లేక్ ని చూడచ్చు. సాయంత్రం మళ్లీ హెటల్‌కు వెళ్ళాలి. నెక్స్ట్ డే ఉదయం దొద్దబెట్టపీక్, టీ మ్యూజియం, పాయ్‌కరా ఫాల్స్ ‌ చూడచ్చు. రాత్రికి అక్కడే స్తే చేసిసి.. మూడోరోజు ఉదయం కున్నూర్‌కు వెళ్లాల్సి వుంది. ఆ డే అంతా కూడ కున్నూర్‌లోని అన్నీ చూసేయచ్చు. నాలుగో రోజు మధ్యాహ్నం కోయంబత్తూర్ రైల్వే‌స్టేషన్‌కు వెళ్లాల్సి వుంది. సాయంత్రం 4:35 గంటలకు మళ్ళీ రైలు ఎక్కితే మరుసటి రోజు మధ్యాహ్నం సికంద్రాబాద్ రీచ్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news