మ్యూచువల్ ఫండ్స్: ఎక్సిట్ లోడ్ ప్రతీ స్కీముకి వర్తిస్తుందా? ఎక్సిట్ లోడ్ లేని ఫండ్స్ ఉన్నాయా?

-

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్సిట్ లోడ్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మీరెంత కాలం ఉండాలనుకున్న దాన్ని బట్టి ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ దీర్గకాలంలో లాభాలచ్చే ఫండ్లు, కొద్ది కాలం మాత్రమే పెట్టుబడి ఫండ్లు ఉంటాయి. అలాగే కేవలం ఒక్కరోజు మాత్రమే పెట్టుబడి పెట్టొచ్చే ఫండ్లు కూడా ఉంటాయి. మీకు తెలియాల్సిందల్లా ఏ ఫండ్లలో ఎంతకాలం పెట్టుబడి పెట్టవచ్చు అనేదే.

ఉదాహరణకి మీరు దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్సిడ్ లోడ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత ఎక్సిట్ లోడ్ ఉండే ఫండ్లు చాలా తక్కువ. ఈక్విటీ ఫండ్లలో ఇది మరీ తక్కువ. ముందుగా ఎక్సిడ్ లోడ్ అంటే ఏమిటో తెలియని వారికోసం..

ఎక్సిట్ లోడ్

మీరు పెట్టిన పెట్టుబడి మీకు కావాల్సినపుడు ఉపసంహరించుకునే అవకాశం మ్యూచువల్ ఫండ్లలో ఉంటుంది. ఐతే దానికి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతుల్లో ఎక్సిట్ లోడ్ ఒకటి. దీని ప్రకారం మీరు పెట్టిన డబ్బుని ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పుడు దానికి కొంత ఛార్జ్ చేస్తారు. దాదాపుగా ఒక సంవత్సరం లోపు విత్ డ్రా తీసుకుంటే ఎక్సిట్ లోడ్ పడే అవకాశం ఉంటుంది. సంవత్సరం తర్వాత మీరెప్పుడు తీసుకున్నా ఎక్సిట్ లోడ్ ఉండదు. ఈ ఎక్సిట్ లోడ్ ఎంత కాలానికి ఉండాలనే విషయం ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు.

ఎక్సిట్ లోడ్ లేని ఫండ్లు ఉంటాయా?

ఈక్విటీ ఫండ్లకి దాదాపుగా ఎక్సిట్ లోడ్ ఉంటుంది. ఎక్సిట్ లోడ్ లేని ఫండ్ల ఉదాహరణకి వస్తే లిక్విడ్ ఫండ్లు అని చెప్పవచ్చు. ఒకరోజు, వారం రోజులు, నెల రోజుల కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారి కోసం లిక్విడ్ ఫండ్లు ఉంటాయి. వాటికి ఎక్సిట్ లోడ్ దాదాపుగా ఉండదు. కాబట్టి మీరు ఏ ఫండ్ పెడుతున్నారు? దానికి ఎక్సిట్ లోడ్ ఎంతశాతం ఉందనేది ముందుగా తెలుసుకోండి.

మ్యూచుఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన దస్తావేజులను జాగ్రత్తగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news