పొగాకు వ్యతిరేక దినోత్సవం: పొగాకు కారణంగా కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం దెబ్బతింటుందా?

-

పొగాకులో ఉండే నికోటి, అసిటోన్, కార్బన్ మోనాక్సైడ్ మొదలగునవి శరీరానికి హాని కలగజేస్తాయి. వీటివల్ల అనేక క్యాన్సర్లు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు రెండు రకాలుగా తీసుకుంటున్నారు. ఒకటి, సిగరెట్, బీడీ వంటివి తాగడం ద్వారా, రెండు, గుట్కా వంటివి నమలడం ద్వారా. పొగాకుని ఎలా తీసుకున్నా ప్రాణాంతకమే. తాజాగా జరిగిన సర్వేలో పొగాకు తీసుకునే వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అవును, కరోనా వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపుతుందని తెలిసిందే. పొగాకు వల్ల ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది.

 

అదీగాక రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ రెండు కారణాల వల్ల పొగాకు తాగేవారికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కరోనా కారణంగా ఆరోగ్యం విషమించే పరిస్థితులు కూడా ఎక్కువే. అందుకే పొగాకు మానేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ప్రస్తుతం పొగాకు తీసుకునేవారికి కరోనా వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తుందా? లేదా దాని సామర్థ్యం దెబ్బతింటుందా అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు కొన్ని జీవనశైలి నియమాలని పాటించాలని చెప్పారు. అందులో పొగ తాగకూడదు అనే విషయం కూడా ఉంది.

దీనర్థం పొగ తాగడం వల్ల కరోనా వ్యాక్సిన్ పై ప్రభావం పడుతుందనే. పొగ తాగేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అదీగాక యాంటీబాండీల స్పందన తక్కువగా ఉంటుంది. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక పొగ తాగకపోవడమే మంచిది. శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల మీద నికోటిన్ ప్రభావితం చూపి, కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుంది. ఈ రెండు కారణాల వల్ల పొగ తాగేవారిలో వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news