లోదుస్తులకు కూడా ఎక్సైరీ డేట్‌ ఉంటుందా..?

-

మనం ఉపయోగించే ప్రతిదానికీ గడువు తేదీ ఉంటుంది. తినే వాటికి, సౌందర్య సాధనాలకు మాత్రమే ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్టలకు కూడా గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా..? లోదుస్తులకు గడువు తేదీలు ఉంటాయట.. దాన్ని బట్టి వాటిని ఎన్ని నెలలు వాడచ్చో తెలుసుకుందాం..

లోదుస్తులకు గడువు తేదీ ఉందా?:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ లోదుస్తులకు గడువు తేదీ ఉండదు. కానీ చాలా నెలలు ఒకే లోదుస్తులను ఉపయోగించవద్దు. అలాగే, లోదుస్తులు వదులుగా లేదా రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని ఎప్పుడూ ధరించకూడదు.

లోదుస్తులను ఎప్పుడు మార్చాలి?:

లోదుస్తుల విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం లోదుస్తులను మార్చడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా మనం అనేక రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. లేకపోతే అలెర్జీలు మరియు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

పాత లోదుస్తులను ఉపయోగించడంలో సమస్యలు:

మీ లోదుస్తులు పాతవి లేదా వదులుగా ఉంటే, దానిని వాడకండి. లేదంటే ఆ రోజంతా ఇబ్బంది పెడుతుంది. అలాగే లోదుస్తులు ఉతికిన తర్వాత కాస్త వాసన వస్తుంటే వాటిని వాడకూడదు. అలాగే లోదుస్తులు గరుకుగా ఉంటే చర్మ సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. అదే సమయంలో, మీరు చెడు లోదుస్తులను ధరిస్తే, మీ శరీరంపై దద్దుర్లు రావడమే కాకుండా మీ ప్రైవేట్ పార్ట్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

బ్రాలు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చాలి.. ఇక టవల్‌ కూడా అంతే.. ఆరు నెలలకు ఒకటి మార్చాలి. మూడు సార్లు కంటే ఎక్కువ వాడితే ఉతకాలి.. అలాగే ముఖానికి బాడీకీ ఒకటే టవల్‌ వాడకూడదు. ఇంట్లో అందరూ కలిపి ఒకటే టవల్‌ అసలే వాడకూడదు. ఒకటే సోప్‌ కూడా వాడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే హైజినెక్‌గా ఉంటారు. లేదంటే ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news