మీ జీవిత భాగస్వామి మనసులో మరొకరు ఉన్నారా..? అయితే ఇలా కనుక్కోవచ్చు…!

చాలా మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ వుంటారు. బాగా ఎక్కువగా జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జీవిత భాగస్వామి మనసులో మరొకరు కూడా ఉండొచ్చు. మరి మీ జీవిత భాగస్వామి మనసులో కూడా ఎవరైనా ఉన్నారేమో అని మీకు సందేహం కలిగితే వీటిని చూడండి. అప్పుడు ఖచ్చితంగా నిజంగా ఎవరైనా వారి మనసులో ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు.

అన్ని విషయాలను రహస్యంగా ఉంచడం:

చాలామంది ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు కానీ మీ జీవిత భాగస్వామి సడన్ గా అన్నింటినీ రహస్యంగా ఉంచితే వాళ్ళ మనసులో మరొకరు ఉన్నారేమో అని అనుకోవచ్చు.

మీ పైన పదేపదే చిరాకు పడితే:

మీ పైన పదేపదే చిరాకు పడితే కూడా మీరు అనుమాన పడొచ్చు పైగా సడన్ గా జీవిత భాగస్వామి ప్రేమగా ఉండకుండా చిరాకుగా ఉంటే కూడా మీరు వాళ్ళ మీద అనుమాన పడొచ్చు.

మరో వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడటం:

మీ పార్ట్నర్ కనుక ఎక్కువగా మరొక వ్యక్తి గురించి మీతో మాట్లాడుతుంటే కూడా మీరు అనుమానపడచ్చు. మామూలుగా భార్యాభర్తలు ఆర్థిక విషయాలు పిల్లలు భవిష్యత్తు గురించి లేదంటే ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా మరొక వ్యక్తి గురించి మాట్లాడితే కూడా మీరు సందేహ పడొచ్చు.

ఎక్కువగా మిమ్మల్ని దూరంగా ఉంచడం:

పదేపదే మిమ్మల్ని దూరంగా ఉంచడం లేదంటే ఎక్కువగా మీ నుండి దూరంగా వెళ్లిపోవడం లాంటివి చేస్తే కూడా మీరు వాళ్ళ మనసులో మరొకరు ఉన్నారేమో అని కనుక్కోవచ్చు.