క్యాట్ వాక్ కాస్త డాగ్ వాక్ అయింది.. వీడియో

-

ఓ వీధి కుక్క.. క్యాట్ వాక్‌ను డాగ్ వాక్ చేసేసింది. ఎందుకంటే.. అదే క్యాట్ వాక్‌లో నడిచింది కాబట్టి. అవును.. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నది. ప్రముఖ డిజైనర్ రోహిత్ బాల్ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్నాడు. మరికొందరు మోడల్స్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. షో ప్రారంభం అవుతుందనగా.. మోడల్స్ అందరూ ఫోటోలను పోజులిస్తుండగా.. ఓ కుక్క అక్కడికి వచ్చింది. మోడల్స్ పక్కన నిలుచొని వాళ్లతో ఫోటోలు దిగింది. అనంతరం ర్యాంపుపై హొయలు ఒలికిస్తుండగా.. దాన్ని గమనించిన సిబ్బంది అక్కడి నుంచి పంపించారు. అది అక్కడి నుంచి వెళ్లిపోయాక.. సిద్ధార్త్ ర్యాంప్‌పై నడిచాడు. కుక్క ర్యాంపుపై హొయలు ఒలికిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Read more RELATED
Recommended to you

Latest news