లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఏం బాంబ్ పేల్చుతాడో..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా హంగామా అందరికి తెలిసిందే. సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి హాట్ టాపిక్ గా మారిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి రిలీజైన రెండు పాటలు కూడా సెన్సేషన్ అయ్యాయి. ఈరోజు ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆర్జివి.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ జీవం పోసుకోనుందని వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఆ సినిమా నుండి వచ్చిన వెన్నుపోటు సాంగ్ టిడిపి శ్రేణుల్లో నిజంగానే గొడవలు సృష్టించగా ఈరోజు సాయంత్రం వర్మ ఏం చేస్తాడు అన్నది హాట్ న్యూస్ అయ్యింది. సినిమా టీజర్ రిలీజ్ చేస్తాడని కొందరు అంటున్నారు. ఈసారి వర్మ ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలంటే 5 గంటలకు దాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news