ఆ వంతనెపై 1960 నుంచి కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయట..!

-

సైన్స్ ఎంతగా డవలప్ అయినా..ఈరోజికి కొన్ని అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎంత తలబద్దలుకొట్టుకున్నా కొన్ని మిస్టరీలను మాత్రం ఛేదించలేకపోతున్నారు. అందులో ఒకటే మనం ఈరోజు చెప్పుకోబోయే..మీ మిస్టరీ బ్రిడ్జి. ఈ బ్రిడ్డి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ, ఇక్కడ కుక్కలు వచ్చి సూసైడ్ చేసుకుంటున్నాయట. 1960 నుంచి ఈ వంతెనపై వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయి. ఇదేంట్రా మనుషులు సూసైడ్ చేసుకుంటారు కానీ, కుక్కలు సూసైడ్ చేసుకోవటం ఏంటి అనిపిస్తుందికదా..అక్కడ ఏం జరుగుతందో చూసేద్దాం.

స్కాట్లాండ్ వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లోని ఓవర్టన్ హౌస్‌కి వెళ్లే రోడ్డుపై ఉంటుంది ఈ బ్రిడ్డి. 1895లో దీని నిర్మాణం పూర్తైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ హెచ్.ఇ. మిల్నర్ ఈ వంతెనను డిజైన్ చేశారు. అంతా ఆయన చెప్పినట్లుగానే నిర్మించారు. ఏం లోపం లేదు.. కానీ చిత్రంగా 1960 నుంచి ఈ వంతెనపై నుంచి వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయట. ఇలా 50కి పైగా కుక్కలు చనిపోతే… 600కు పైగా కుక్కలు పడిపోయినా గాయాలతో బయటపడ్డాయి. వంతెన కింద 50 అడుగుల దిగువలో రఫ్‌గా ఉండే బండరాళ్లపై ఈ కుక్కలు పడిపోతున్నాయి. అవి ఎందుకు అలా చేస్తున్నాయో ఎవరికీ తెలియట్లేదు. అవి ఆత్మహత్య చేసుకుంటూ ఉండొచ్చని కొంత మంది చెప్తున్నారు. పరిశోధకులు ఆ మాటల్ని కొట్టిపారేశారు.. కుక్కలు ఎక్కడైనా సూసైడ్లు చేసుకుంటాయా అని ఎదురు ప్రశ్నించారు. మరైతే అక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు.

వింటున్న మనకే ఏంట్రా కుక్కలు ఎందుకు ఇలా చేస్తున్నాయ్ తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది.ఇక అక్కడి వారికి ఎందుకు ఉండదు చెప్పండి. కారణం తెలియాలని వారు పట్టుపట్టారు. దాంతో స్కాట్లాండ్‌లోని జంతువులపై హింసను నియంత్రించే సొసైటీ వారు రంగంలోకి దిగారు. తమ సంస్థ నుంచి కొంత మంది ప్రతినిధులను ఆ వంతెన దగ్గరకు వెళ్లి ఎలాగైనా మిస్టరీని ఛేదించి చూపించాలి తెగ ప్రయత్నించారు. కానీ ఏమీ తెలుసుకోలేకపోయారు. ఉత్తిచేతులతో తిరిగి సొసైటీకి పయనం అయ్యారు.

కేవలం ఒక ప్రదేశంలోనే జరుగుతున్నాయన్నారు

సాధారణంగా ఇలాంటి మిస్టరీలను ఛేదించాలని కొంతమందికి బాగా కుతూహలంగా ఉంటుంది. అలాంటి కొందరు వంతన మొత్తంలో కాకుండా కేవలం ఒకచోట మాత్రమే ఇలా జరుగుతుందని వాదించటం మొదలుపెట్టారు. అది ఎంత వరకూ నిజం అనే దానిపై శాస్తవేత్తలు పరిశోధన చేశారు. వారి వాదన తప్పని తేలింది. వంతెనపై చాలా చోట్ల నుంచి కుక్కలు కింద పడ్డాయి. కొన్నిసార్లు ఒకే చోటి నుంచి కూడా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే..ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా రోజులో ఎప్పుడైనా పడిపోతున్నాయి.

ఎవరికి అనిపించింది వాళ్లు అనేస్తున్నారు

ఇలాంటి మిస్టరీలకు మూలం దెయ్యాలనే అంటుంటారు. అలాగై ఈ బ్రిడ్జికి కూడా అలానే జరిగింది. కథలు, పుకార్లు చాలా పుట్టుకొచ్చాయి. ఆ బ్రిడ్జి దగ్గర దెయ్యం ఉందని, ఆ దెయ్యానికి కుక్కలంటే ఇష్టం ఉండదని అందుకే అలా చేస్తుందని అనేవాళ్లు. కొంతమంది ఈ వాదనను ఖండించారు.

ఈ క్రమంలోనే మరో షాకింగ్ కోణం కూడా తెరపైకి వచ్చింది. కొంత మంది ఆ బ్రిడ్జి కింద నుంచి ఓ రకమైన జంతువు అరుస్తున్నట్లు శబ్దాలు వస్తుంటాయనీ, అలాగే ప్రత్యేకమైన జంతువు వాసన కూడా వస్తుందనీ ఆ అరుపులు, వాసనకు ఆకర్షించి కుక్కలు దూకేస్తున్నాయని కొందరు వాదించారు. పైగా ఈ అరుపులు, వాసన మనుషులకు రావనీ, కుక్కలకు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు.

ఈ వాదనను కూడా హేతువాదులు నమ్మలేదు. ఇలా ఇదో మిస్టరీగా ఉండిపోయింది. ఇక ఈ బ్రిడ్జిపై నుంచి కుక్కల్ని తీసుకెళ్లేవారు జాగ్రత్తగా తీసుకెళ్లాలనే రూల్ తెచ్చి అధికారులు కూడా కామ్ అయిపోయారు. అలా ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news