వింత: స్టేజ్ మీద వరుడికి మంగళ సూత్రాన్ని ఇచ్చిన డ్రోన్…!

-

ఇప్పటి కాలం అంతా మారిపోయింది. రోజు రోజుకి టెక్నాలజీ కూడా బాగా పెరిగి పోతోంది. కొత్త కొత్త పరికరాల తో ఏదో ఒక మార్పు కనపడుతోంది. ఈ రోజుల్లో డ్రోన్లను వాడడం కూడా బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరు వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎంతో మంది ఈ డ్రోన్లని పెళ్ళిళ్ళల్లో వాటిల్లో కూడా ఉపయోగించడం కామన్ అయిపోయింది. ఇది ఇలా ఉంటె తాజాగా కర్ణాటక రాష్ట్రం లో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ ని ఉపయోగించడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం.

ఆ పెళ్ళి లో జరిగిన ఆ సంఘటన గురించి చూస్తే మీరు కూడా అవాక్ అవుతారు. అదేమిటి అనే విషయానికి వస్తే… దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. చూసిన ప్రతీ ఒక్కరు అవాక్ అవుతున్నారు. మామూలుగా ఎక్కడైనా పెళ్లిల్లో మంగళ సూత్రాన్ని పూజారి వరుడికి అందివ్వడం చూస్తాం. కానీ ఇక్కడ వేరేలాగ జరిగింది.

ఇది ఉడుపి జిల్లా లోని కర్కాల ప్రాంతం లో శనివారం చోటు చేసుకుంది. జరిగిన ఓ క్రైస్తవ వివాహం లో డ్రోన్​ ని ఉపయోగించారు. గాల్లోంచి మంగళ సూత్రం తీసుకొచ్చి స్టేజీ పైన ఉన్న వరుడికి అందించింది డ్రోన్. అది తీసుకుని వరుడు వధువుకి కట్టాడు. ఇలా డ్రోన్ స్టేజ్ మీదకి తీసుకు వచ్చిన వీడియో వైరల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news