చైనా ఐస్‌క్రీంలో కరోనా.. సంస్థ తాత్కాలిక మూసివేత..!

-

ప్రపంచాన్ని గడగడ లాడిస్తోన్న కరోనా పుట్టినిల్లైన చైనాలో మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా చైనాకు చెందిన ఓ ఫుడ్‌ కంపెనీలో తయారైన ఐస్‌క్రీంలో కరోనా ఆనవాళ్లను గుర్తించింది. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా తీవ్రరూపం దాల్చిన విషయం అందరికీ తెలిసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రకటన చైనాలో కలకలం రేపుతోంది.

చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని తియాన్జిన్‌ ప్రాంతంలోని ఓ ఫుడ్‌ కంపెనీ తయారు చేసిన ఐస్‌క్రీంలో కరోనా ఆనవాళ్లను గుర్తించారు. దీంతో ఆ సమయంలో తయారైన అన్ని ప్రొడక్ట్స్‌ని సంస్థ వెనక్కి తీసుకుంది. ఆ సమయంలో 390 కార్టన్లను మాత్రమే విక్రయించామని, మరో 29 వేల కార్టన్లు అలాగే ఉన్నాయని సంస్థ యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ఐస్‌క్రీం అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో వివరాలు తెలియదు. దీంతో అధికారులు అమ్మకాలు ఎక్కడెక్కడ చేశారనే పనిలో నిమగ్నమయ్యారు.

సంస్థ మూసివేత..
ఐస్‌క్రీం తయారీకి న్యూజిలాండ్‌, ఉక్రెయిన్‌ దేశం నుంచి పిండి పదార్థాలను దిగుమతి చేసుకుందని చైనా వెల్లడించింది. అయితే ఈ ఐస్‌క్రీంని ఎవరైనా కొనుగోలు చేశారా.. ఎవరైనా వ్యక్తులు కరోనా బారిన పడ్డారా.. అనే కోణంలో అక్కడి అధికారులు విచారణ చేపడుతున్నారు. ఐస్‌క్రీంతో కరోనా ఆనవాళ్లు కనిపించడంతో సంస్థను తాత్కాలికంగా మూసివేశామని, ఉద్యోగులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.

చైనా కొత్త ఆరోపణలు..
విదేశాల నుంచి ప్రయాణికులు తీసుకొచ్చే ఆహార పదార్థాలతోనే కరోనా వైరస్‌ వస్తున్నట్లు చైనా ఆరోపిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ నిపుణులు స్పందించారు. ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించడం తక్కువేనని తేల్చి చెప్పారు.

వైరస్‌ తీవ్రత ఎక్కువ..
ఇప్పటికే బీజింగ్‌కు సమీపంలోని హెబీ ప్రావిన్సులో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించింది చైనా. దాదాపు 9500 గదులు కలిసిన ఆస్పత్రిని కూడా ప్రారంభించింది. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. చైనాలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం వుహాన్‌కు చేరుకుంది. క్వారంటైన్‌లోనే ఉంటూ వివరాలను సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news