ఉబర్‌ యాప్‌లో తప్పు కనిపెట్టి.. 4. 6 లక్షల రివార్డ్‌ పొందిన ఎథికల్‌ హ్యాకర్

-

ఇంతకు ముందు ఎక్కడికి వెళ్లాలన్నా, ఏది కొనాలన్నా.. పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. పర్సులో డబ్బు లేకుండే అంతే ఇంతే.. ఇక ఎక్కడికైనా వెళ్లాలంటే.. అయితే మన దగ్గర వెహికిల్‌ ఉండాలి..లేదా రోడ్డుమీద కెళ్లి.. ఆటోలు, బస్సుల కోసం చూడాలి.. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు.. ఆటోవాళ్లు ఫుల్‌ అయ్యే వరకూ స్టాట్‌ చేయరు.. అబ్బో అవన్నీ పెద్ద పంచాయితీలు..కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని.. ఫోన్‌ ఉండి అందులో నెట్‌ బ్యాలెన్స్‌ ఉంటే చాలు.. ఏది కొన్నా ఈజీగా స్కాన్‌ చేసి పే చేస్తున్నాం.. ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఇంట్లో ఉండే ఆటోలు, బైక్‌లు బుక్‌ చేసుకుంటున్నాం.. క్షణాల్లో ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి.. అయితే ఏ యాప్‌లో అయినా..కొన్ని ఇష్యూస్‌ ఉంటాయి..వాటి వల్ల మనకు కూడా చిరాకు వస్తుంది. కొన్నిసార్లు.. ఈ ఉబర్‌, రాపీడోలో..మనం డబ్బులు పే చేసినా.. అందులో కట్టనట్లే చూపిస్తుంది. దానివల్ల నెక్స్ట్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు రైడ్‌ అమౌంట్‌ కూడా పే చేయమంటుంది.. ఇలాంటి బగ్స్‌ చాలా యాప్స్‌లో ఉన్నాయి.. కొన్నిసార్లు ఈ బగ్స్‌ కారణంగా..కష్టమర్లు నష్టపోతే.. మరికొన్నిసార్లు ఆ యాప్స్‌ కూడా నష్టపోతాయి.. అలాగే ఉబర్‌ కూడా తన బగ్‌ కారణంగా చాలా నష్టపోయింది..

Uber Technologies Inc (NYSE:UBER) Share Price | RNS News, Quotes, & Charts  | UBER |

 

ఉబర్ యాప్‌లో ఏర్పడిన బగ్ కారణంగా చాలా నష్టాల్లో కూరుకుపోయింది. సైబర్ సెక్యూరిటీ సంస్థను స్థాపించిన ఎథికల్ హ్యాకర్ ఆనంద్ ప్రకాష్, ఉబర్ యాప్‌లో ఉన్న బగ్‌ని గుర్తించాడు. ఆ బగ్ కారణంగా కస్టమర్లకు ఫ్రీ రైడ్స్ వస్తుండేవి.

కస్టమర్లు ఉబర్‌లో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్‌ని అందులో కనిపించే పద్దతుల్లో కాకుండా వేరే విధంగా చేయడం వల్ల కస్టమర్లకు ఫ్రీ రైడ్ వచ్చేది. ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఫ్రీ రైడ్ వచ్చేది. ఈ బగ్ ని ఆనంద్ ప్రకాష్ గుర్తించాడు. ఏదో సరదాగా ఉబర్ యాప్‌ని చెక్ చేస్తూ ఈ బగ్ ని కనిపెట్టాడు. వెంటనే ఉబర్ యజమాన్యానికి దీని గురించి సమాచారం ఇచ్చాడు… తనను తాను సమీక్షించుకున్న ఉబర్, 24 గంటల్లోనే బగ్‌ని క్లియర్ చేసింది. ఇలా తమ తప్పిదాన్ని గుర్తించినందుకు 4.6లక్షల రివార్డును అందజేసింది. ఈ విషయాన్ని ఆనంద్ ప్రకాష్, తన లింక్డ్ ఇన్ పేజీలో చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news