ఎగిరే చేపలను ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఇవే..

-

మాములుగా చేపలు నీటిలో ఈదుతాయి.. నీళ్ళే వాటికి ముఖ్యం.. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే చేపలు మాత్రం నీటిలో ఈదుతాయి..గాల్లో ఎగురుతాయి. రాత్రుళ్ళు ఒడ్డుకు వచ్చి కూడా నిద్రపోతాయి.. ఏంటి నిజమా అనుకుంటున్నారా..? మీరు విన్నది అక్షరాల నిజం..నీటిలో ఈదే చేపలు గాల్లో ఎగురుతున్నాయి. నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్‌ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తున్నాయి. ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్‌ ఫిష్‌’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి.

Flying Fish Symbolism, Dreams, and Messages - Spirit Animal Totems

ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి. ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు. లాటిన్‌ భాషలో ఎక్స్‌ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‌’ అంటే మంచం అని అంటారు. ఇవి రాత్రి పూట సముద్రపు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి అందుకే వీటిని లాటిన్‌లో అలా పిలుస్తారట. అయితే ఇవి దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. పక్షలు రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఇవి రెక్కలను ఊపలేవు. నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత దూరం ఎగురుతాయి..వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి. ఇవి చిన్నచిన్న చేపలను, పాచిని తీని జీవిస్తాయి. ఇవి సెకనుకు దాదాపు మీటరు వేగంతో ఉపరితలం వైపు ఈదుతాయి..

ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు. అట్లాంటిక్, పసిఫిక్‌ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల వీటి గమనం బంగాళాఖాతం లోనూ కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, తైవాన్, చైనా, వెనిజులా, బార్బడోస్‌ జలాల్లో ఎగిరే చేపలు ఉన్నాయి. మాల్దీవులు, చెన్నయ్‌ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి.. వీటిని పట్టుకున్న వెంటనే వండుకొని తినేయ్యాలట.. లైట్ల సాయంతో వీటిని పట్టుకోవడం సులువట.. ఆ చేపలు ఎలా ఎగురుతున్నాయో కింద వీడియోలో చుడండి..

Read more RELATED
Recommended to you

Latest news