క‌రోనా వైర‌స్ ఎలా ఉంటుందో తెలుసా..?

-

కరోనా వైరస్‌ కంటికి కనిపించదు కదా! అది ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? ఇదేగా మీ సందేహం? కరోనా వైరస్‌ మూమూలుగా చూస్తే కంటికి కనిపించదు నిజమే. కానీ మన దేశానికే చెందిన శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను ఫొటో తీశారు. ఆ ఫొటో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో కూడా ప్రచురితమైంది. ట్రాన్స్ మిష‌న్ ఎల‌క్ట్రానిక్ మైక్రోస్కోప్ విధానాన్ని ఉప‌యోగించి ఆ వైర‌స్‌ను కెమెరాలో బంధించారు.

చైనా నుంచి వ‌చ్చిన కేర‌ళ విద్యార్థి న‌మూనాల నుంచి ఈ ఫొటోను తీసినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థుల్లో క‌రోనా పాజిటివ్‌గా తేలింది. మెడిసిన్ చ‌దువ‌డానికి వుహాన్ వెళ్లిన ఈ ముగ్గురు విద్యార్థులు అక్కడ క‌రోనా విజృంభించ‌డంతో భార‌త్‌కు తిరిగొచ్చారు. దేశంలో న‌మోదైన తొలి మూడు క‌రోనా కేసులు ఇవే. ఆ ముగ్గురిలో క‌రోనా పాజిటివ్ అని తేల‌గానే వారి నుంచి న‌మూనాలను సేక‌రించి పుణెలోని ప్రయోగశాలకు పంపించారు.

ఆ త‌ర్వాత పుణెలో వారి నమూనాల నుంచి కొవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్‌ను గుర్తించి ఫొటోలు తీశారు. ఈ సార్స్ కోవ్-2 వైర‌స్‌ అచ్చం ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సార్స్ కోవ్ వైర‌స్‌నే క‌రోనా వైర‌స్ అంటారు. క‌రోనా అంటే లాటిన్ భాష‌లో కిరీటం అని అర్థమట. సార్స్ కోవ్‌-2 వైర‌స్ చూడటానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news