కరోనా వైరస్ ఫోటో తీసిన భారత శాస్త్రవేత్తలు…!

-

కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం కట్టడి అవ్వడం లేదు అనేది వాస్తవం. మన దేశం సహా అన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది అనేది అర్ధమవుతుంది. అయితే కరోనా వైరస్ రూపం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఇది కిరీటంలా ఉంటుంది అని అన్నారు.

దీన్ని ఎలా అయితే వైద్యులు గుర్తించారు. మన భారతీయ శాస్త్రవేత్త మైక్రోస్కోప్ ద్వారా కరోనా వైరస్ ఫొటో తీశారు. పుణె వైరాలజీ ల్యాబ్‌లో ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి వైరస్ ఫోటో ని తీసారు. కరోనా రూపం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైతం ప్రచ్రించారు. కరోనా వైరస్ జన్మించిన చైనాలోని వూహాన్‌ సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు మన దేశానికి జనవరిలో వచ్చారు.

ఆ ముగ్గురిలో కరోనా లక్షణాలు కనిపించిన నేపధ్యంలో… పరీక్షలు చేసి వారికి కరోనా ఉందని నిర్ధారించారు. విద్యార్ధుల్లో ఒకరి నమూనాలను పరీక్ష చేస్తుండగా కరోనా వైరస్ ని గుర్తించిన శాస్త్రవేత్తలు అధునాతన పరిజ్ఞానం ద్వారా ఫొటో తీశారు. మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 21 రోజులు దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news