మొదటి పుట్టగొడుగుల పార్క్‌ ప్రారంభం!

-

భారత్‌లో మొదటి పుట్టగొడుగుల పార్క్‌ (mashroom park) ను ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో ఆదివారం ప్రారంభించారు. ఈ పార్క్‌లో దాదాపు 50 రకాల క్రిప్టోగ్రామ్స్‌ జాతులు ఉన్నాయి. రకరకాల పుట్టగొడుగులు ఉన్నాయి. ఈ పార్క్‌ నిర్మాణం కూడా దేవవనంలో సముద్రమట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. దీని విస్తిర్ణం కూడా మూడు ఎకరాల్లో ఉంది. అసలు క్రిప్టోగ్రామ్స్‌ అంటే పురాతన మొక్కలు అని అర్థం. ఇవి పరిశుభ్రమైన వాతావరణంలోనే పెరుగుతాయట. అంటే అవి ఉండే చోట ఆరోగ్యకరమైందని అర్థం చేసుకోవచ్చు. దాదాపు రాక్షస బల్లుల కాలం నుంచి ఇవి భూమిపై ఉన్నాయని అంచనా. అంతేకాదు ఇవి విత్తనాల ద్వారా ఎదిగే మొక్కలు కావు. అంటే ఇవి ఆల్గే, ఫెర్న్, ఫింగీ వంటివి. మీకు తెలియని విషయం ఎంటంటే వీటిలో మంచి ఆరోమా ఉంటుంది కనుక వంటకాల్లో కూడా వాడతారు.

పుట్టగొడుగుల పార్క్‌ / mashroom park
పుట్టగొడుగుల పార్క్‌ / mashroom park

ఇందులో ఉండే లిచెన్స్‌ రకాన్ని హైదరాబాద్‌ బిర్యానీ, ఇతర పదార్థాల్లో వాడతారు. వీటిని ఔషధాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ మొక్కల ప్రాధాన్యమేంటో ప్రజలకు తెలిపేందుకే ఈ పార్క్‌ ఏర్పాటు చేశామని అడవుల పరిశోధనాధికారి, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ చతుర్వేది తెలిపారు.

ముఖ్యంగా ఆల్గేల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా మాసెస్‌ జాతి మొక్కల్లో యాంటీ–ఫంగల్‌ గుణాలున్నాయి. అంతేకాదు, భారలోహాలను ఫిల్టర్‌ చేయడానికి కూడా ఫెర్న్‌ జాతి మొక్కల్ని వాడుతున్నారు. సాధారణంగా దేవవనం అంటేనే కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఇక తేమతో కూడిన వాతావరణం దీనికి కలిసి వస్తుందని భావించి అందుకే ఈ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news