చాలా మంది మగవారు ఒత్తుగా గడ్డాన్ని పెంచాలని అనుకుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు గడ్డం వేగంగా పెరగదు. గడ్డం బాగా పెరగాలన్నా, చిన్నగా స్టైలింగ్ చేసుకోవాలన్నా ఈ విధంగా ఫాలో అవ్వండి. దీంతో గడ్డం వేగంగా పెరుగుతుంది.
షేవింగ్ లో మార్పు:
సాధారణంగా మగవాళ్ళు షేవింగ్ చేసుకొనేటప్పుడు పైనుండి కిందకి రేజర్ తో షేవ్ చేస్తారు అయితే త్వరగా గడ్డం పెరగాలంటే కింద నుండి పైకి షేవ్ చేయండి. ఇలా చేయడం వల్ల గడ్డం త్వరగా పెరుగుతుంది.
ఆముదం:
మీరు వివిధ రకాల ఖరీదైన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయడం కంటే కొద్దిగా ఆముదం తీసుకుని ప్రతి రోజు రాత్రి గడ్డం ప్రాంతంలో రాయండి. ఇలా చేయడం వల్ల గడ్డం ఒత్తుగా ఎదుగుతుంది.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ తో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల గడ్డం త్వరగా ఎదుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం జుట్టు పెరుగుదలకు ఆలివ్ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని తెలుస్తోంది.
ఆహారం:
మీరు తీసుకునే ఆహారం కూడా మీ గడ్డానికి సహాయం చేస్తుంది. మీ డైట్ లో కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, అరటిపండ్లు, సోయాబీన్ పిండి వంటివి తీసుకోవడం వల్ల గడ్డం త్వరగా ఎదుగుతుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె కూడా గడ్డంని ఒత్తుగా పెంచుతుంది. మీరు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో రోజ్మెరీ ఆయిల్ వేసి రాసుకుంటే ఇంకా మంచి ఫలితం కనబడుతుంది.
స్మోక్ చెయ్యద్దు:
రెగ్యులర్ గా స్మోక్ చేయడం వల్ల సిగరెట్లో ఉండే నికోటిన్ బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది కాబట్టి స్మోకింగ్ కి దూరంగా ఉండండి.
ఒత్తిడి :
ఒత్తిడి వల్ల కూడా గడ్డం ఎక్కువగా ఎదగదు. ఒత్తిడిని కంట్రోల్ తగ్గించుకుంటే గడ్డం ఎదుగుదలకు సహాయపడుతుంది. అలానే నిద్ర కూడా దీని పై ప్రభావం చూపిస్తుంది.