బ్రేకింగ్‌ : పంజ్‌షీర్ ను వశం చేసుకున్న తాలిబ‌న్లు

అఫ్ఘానిస్థాన్‌ దేశం లో తాలిబన్ల ఆగడాలు.. రోజు రోజు కు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్‌ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లు ఆగకుండా.. మరో ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక మైన పంజ్‌ షీర్‌ ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. సల్‌ హే ఇండిని డ్రోన్లతో కూల్చేసిన తాలిబన్లు అనుకున్నది సాధించారు.

పంజ్‌షీర్‌ ను కైవసం చేసుకున్న తాలిబన్లు… పంజ్‌ షీర్‌ గవర్నర్‌ కార్యాలయం పై జెండా ఎగుర వేశారు. ఆ తర్వాత పంజ్‌షీర్‌ ను కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు.   అంతే కాదు… మసూద్‌ కీలక అనుచరుడైన ఫహీం దష్టిని కాల్చి చంపారు తాలిబన్లు. దీంతో పంజ్‌ షీర్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లింది. పంజ్‌షీర్‌ యుద్ధ యోధులు ఎన్ని ప్రయత్నాలు చేసినా…. ఫలితం లేకపోయింది. తాలిబన్ల ఎదురు దాడి ముందు… పంజ్‌షీర్‌ యుద్ధ యోధులు నిలువ లేక పోయారు. కాగా.. పంజ్‌షీర్‌ యుద్ధ యోధుల చేతిలో దాదాపు 300 కు పైగా తాలిబన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.