కుక్క కోసం..రెండు ఊర్ల మనోవేదన.. ఆలయం కట్టి పూజలు..!!

-

కుక్కలను ప్రేమగా చూసుకునే వాళ్లం చూసి ఉంటారు.. కానీ కుక్క కోసం.. రెండు ఊర్లు కదిలి వచ్చి ఆలయాన్ని కట్టి.. దేవుడిలా పూజిస్తున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని అంటారు కదా..అదేనేమో ఇది.. ఉత్తరప్రదేశ్.. ఝాన్సీలో బిచ్ క్వీన్ ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయ విశేషాలు ఏంటో చూద్దామా..!బిచ్ క్వీన్ టెంపుల్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్‌ అవుతారు.. ఈ ఆలయం ఝాన్సీ జిల్లాలోని మౌరానీపూర్ తహసీల్‌లో ఉంది. ఈ బిచ్ క్వీన్ ఆలయం మౌరానీపూర్‌లోని రేవాన్, కక్వారా గ్రామ సరిహద్దులో ఉంది. ఇది రోడ్డు పక్కన నిర్మించిన చిన్న ఆలయం. రోడ్డు పక్కన తెల్లటి ప్లాట్‌ఫామ్‌పై నల్ల కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ ఆలయానికి వస్తారు, పూజలు చేస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు.

అసలు ఆరోజు ఏం జరిగిందంటే..

రేవాన్, కక్వారా గ్రామాల్లో ఓ ఆడ కుక్క నివసించేది. ఏ వేడుక జరిగినా ఆహారం కోసం అది వచ్చేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకసారి రేవాన్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తిండి కోసం ఆ కుక్క ఈ గ్రామానికి వచ్చింది.. కానీ అప్పటికే అక్కడ భోజనం అయిపోయింది. ఆ తరువాత అది… కక్వారా గ్రామానికి వెళ్లింది. అక్కడ కూడా దానికి ఆహారం దొరకలేదు. చివరికి అది ఆకలితో చనిపోయింది. ఆ కుక్క చనిపోవడం చూసి రెండు గ్రామాల ప్రజలూ తీవ్ర మనోవేదన చెందారు. తర్వాత రెండు గ్రామాల సరిహద్దులో కుక్కను పాతిపెట్టి… కొంత కాలం తర్వాత అక్కడే గుడి కట్టారని.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న చరిత్ర నిపుణుడు హరగోవింద్ కుష్వాహా చెబుతున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే, ప్రజలు ఈ ఆలయానికి వెళ్లి ఆహారాన్ని సమర్పించడం సంప్రదాయం.
స్టోరీ కామన్‌గా ఉన్నా.. క్లైమాక్స్‌ వెరైటీగా ఉంది కదా..! కుక్కకు ఆలయం కట్టి దేవుడిలా పూజించడం అంటే గొప్ప విషయమే..! మీకు తెలిసి ఇలాంటి ఆలయాలు ఎక్కడైనా ఉంటే కమెంట్‌ చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news