పసుపు సాగులో విత్తనశుద్ధి విషయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

పసుపును పచ్చ బంగారం అంటారు.. పూజల దగ్గరి నుంచి, అందానికి, ఆహారంలో ప్రతి దాంట్లో పసుపు ముఖ్యమైంది.. అందుకే మనదేశంలో పసుపుకు మంచి డిమాండ్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగవుతుంది. పసుపు పండించే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతోపాటు, అధిక లాభాలు గడించవచ్చు. పంట వేసే ముందే రైతులు దీని సాగుపై అవగాహన కలిగి ఉండటం తప్పని సరి.

 

 

పసుపు పంట కోసం ఎంపిక చేసుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. పసుపు విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడిలో చాల వరకు కోల్పోవడం జరుగుతుంది. విత్తనశుద్ధి చెయ్యడం వలన దుంప కుళ్ళు తెగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చు..

పసుపులో విత్తన శుద్ధి:

విత్తనం వేసే ముందు డైమితోయేట్ 2 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ / 1 లీటర్ నీటికి కలుపుకొని 30 నిమిషాలపాటు ఈ ద్రావణంలో పసుపు దుంపలను ఉంచిన తరువాత విత్తుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల తెగుళ్లు, చీడల నుంచి పంటను కాపాడుకోవచ్చు..

ఇకపోతే పంట వేసే ముందు వేసవిలో లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల కలుపు విత్తనం చాల వరకు నాశనం అవుతాయి. విత్తనం నాటిన మరుసటి రోజు అట్రజిన్ ౩ గ్రా 1 లీటర్నీ టికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. విత్తనం వేసిన 16-18 రోజుల తరువాత మొలకెత్తుతాయి.. అందుకే వారం రోజుల లోపే గొర్రు చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news