కరోనా రోగులకు ఉచిత ట్యాక్సీ… డ్రైవర్ కి డాక్టర్ సెల్యూట్…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో వైద్యుల పాత్ర అనేది చాలా కీలకం. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వాళ్లకు చేతులు ఎత్తి మొక్కే పరిస్థితి. వాళ్లకు, పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఇప్పుడు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంది. అలాంటి వైద్యులు… ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ కి సెల్యూట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్పానిష్ టాక్సీ డ్రైవర్ మాడ్రిడ్లోని ఒక ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది.

అక్కడ కరోనా వైరస్ రోగుల కోసం ట్యాక్సీ డ్రైవర్ లో ఉచితంగా రైడ్ లు చేస్తున్నారు. ఒక ట్యాక్సీ సంస్థకు చెందిన ఒక డ్రైవర్ ఆస్పత్రి లోపలి నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రి సిబ్బంది పెద్ద చప్పట్లతో సత్కరించారు. తన నిస్వార్థ సేవ కోసం నగదు ఉన్న కవర్ ని కూడా అందించారు వైద్యులు. దీనితో అతను ఉద్వేగానికి గురయ్యాడు. రోగిని తీసుకుని వెళ్ళాలి అని పిలిచారు అక్కడి వైద్యులు.

ఏడుపు ఆపులేక అతను కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ వీడియో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. సోషల్ మీడియా అతన్ని హీరో అంటూ అతనికి ధన్యవాదాలు చెప్పింది. కాగా స్పెయిన్ లో కరోనా కేసులు రెండు లక్షలకు దగ్గరగా ఉన్నాయి. మరణాలు కూడా 20 వేలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్యలో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news