ఫన్నీ వీడియో: అన్నం పెట్టమంటూ కోపంతో గిన్నెను పడేసిన కుక్క..!

సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. మనుషుల వీడియోలు చేస్తే పెద్దగా నవ్వు రాకపోవచ్చు. కానీ, జంతువులు కోపడటం, అలగటం, మారం చేయడం, గొడవ పడటం వంటి వీడియోలు ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఫిదా అయి కామెంట్ల వర్షం కురిపిస్తారు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు నవ్వు ఆపుకోలేరు.

dog fight
dog fight

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుసామి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. దీనికి ‘నాకు ఆకలి వేసిన 0.5 మెక్రో సెకన్ల తర్వాత’ అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను చూసినట్లయితే ఒక కుక్క తన యజమాని దగ్గరికి వెళ్లి బాగా అరుస్తుంది. వెంటనే డోర్ పక్కన ఉన్న గిన్నెను చూపించి కోపంతో విసిరేస్తుంది. ఆ తర్వాత మళ్లీ యజమానిపై అరుస్తుంది. అయితే ఈ వీడియోలో కోపంతో కనిపించే ఆ కుక్కను చూస్తే చాలా ముద్దేస్తుంది. టైంకి ఆహారం పెట్టాలని తెలియదా అంటూ కోపంలో ఆ కుక్క అంటున్నట్లు అనిపిస్తది.

ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. క్యాలెండర్ అన్నం పెట్టు.. క్యాలెండర్ అన్నం పెట్టమని, క్యూట్‌నెస్ ఓవర్ లోడేడ్ అని, నీ వల్ల ఒక్కపని కూడా చాతకాదని, ఆకలితో ఉన్న కుక్కతో పరాచకాలు ఆడొద్దు.. కరిస్తే ప్రమాదమే, ఈ వీడియో పెదాలపై చిరునవ్వు తెస్తోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇప్పటివరకు 4 లక్షలపై వీవర్స్ చూశారు. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ఈ వీడియోను ఏప్రిల్ 5వ తేదీన అప్లోడ్ చేశారు. లైకులు, రీట్విట్, కామెంట్లతో ఈ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, ప్రవీణ్ అంగుసామికి పలు జంతువులకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా పంచుకోవడం అలవాటు.