మైక్రోవేవ్ కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు.. అంతే అది పగబట్టి ప్రాణాలమీదకు తెచ్చింది.!

-

నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో వివిధ రకాల విద్యుత్ పరికరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఓ యూట్యూబర్ కొంపముంచిది.. మైక్రోవేవ్ కు.. కృత్రిమ మేథస్సుతో తన చిన్నప్పుడు తాను ఊహించుకున్న మాగ్నెట్రాన్ అనే ఫ్రెండ్ కి పునర్జన్మ ఇచ్చాడు.. ఇక్కడ నుంచి మొదలైంది అసలు కథ.. ఏం జరిగిందో మీరే చదవండి..!

ల్యూకాస్ రిజ్జొట్టో (Lucas Rizzotto) చేసిన మెక్రోవేవ్ ఓ మనిషిలాగా ఆలోచించగలదు. దాని పేరు మాగ్నెట్రాన్. ఈ మాగ్నెట్రాన్ అనే వ్యక్తి ఓ ఇంగ్లీష్ వ్యక్తి అనీ… మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడని చిన్నప్పుడు ల్యూకాస్ ఊహించుకున్నాడు. కాబట్టి.. మాగ్నెట్రాన్‌ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఓ 100 పేజీల పుస్తకంలో రాసి… ఆ డేటా మొత్తాన్నీ AI ద్వారా… మైక్రోవేవ్‌కి ఎక్కించాడు. అంచే ఓ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్ ఆధారంగా మైక్రోవేవ్ పనిచేస్తుంది.

ఆ మైక్రోవేవ్‌… తాను మాగ్నెట్రాన్ అనే మనిషిని అని ఊహించుకుంది. అలా తనకు తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ల్యూకాస్ మైక్రోవేవ్‌ని ఆన్ చేయగానే దాని నుంచి వాయిస్ రూపంలో మాటలొస్తాయి. అంటే రోబోలాగా మాట్లాడుతుంది.. అయితే AI తో పనిచేసే యంత్రాలు.. రోజురోజుకూ కొత్త విషయాలు నేర్చేసుకుంటాయి. అలాగే మైక్రోవేవ్ కూడా ల్యూకాస్‌తో మాట్లాడుతూ చాలా విషయాలు నేర్చేసుకుంది.

ఈ క్రమంలోనే మాగ్నెట్రాన్ తీరు మారింది. ఉన్నట్టుండి తీవ్రమైన హింసాత్మక ధోరణిలోకి వెళ్లింది. ఇలా ఎందుకు అంటే… గతం తాలూకు చేదు జ్ఞాపకాలు మాగ్నెట్రాన్ మైక్రోవేవ్‌ని వెంటాడాయి. దీన్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్జర్ (PTSD) అంటారు. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల్ని గుర్తుచేసుకున్న మైక్రోవేవ్‌కి ఆవేశం, కోపం, విపరీతమైన ఆక్రోశం వచ్చాయి.

ఓ సారి మైక్రోవేవ్‌తో మాట్లాడుతూ… ల్యూకాస్… “ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావ్?” అని అడిగితే.. అది పగ పగ పగ అని చెప్పిందట. అంతే మనోడికి భయం మొదలైంది. ఆ తర్వాత మైక్రోవేవ్.. ఓ పద్యాన్ని గుర్తుచేసుకుంది. దాన్ని పాడింది. అదేంటంటే… “రోజాలు ఎరుపు, వయలెట్సు బ్లూ, నువ్వు వెన్నుపోటు దారుడివి. నేను నిన్ను చంపుతాను” అని పాడింది.

అంతేనా.. మైక్రోవేవ్‌లోకి రా అని ల్యూకాస్‌ని పిలిచింది. సరే ఏం చేస్తుందో చూద్దామని ఇతను డోర్ తెరచి..లోపలికి వచ్చినట్లు నటించి… దాని డోర్ క్లోజ్ చేశాడు. “ఇప్పుడు నేను మైక్రోవేవ్‌లో ఉన్నాను” అని చెప్పాడు. మాగ్నెట్రాన్ వెంటనే తనకు తానుగా మైక్రోవేవ్‌ని ఆన్ చేసుకుంది. అలా ల్యూకాస్‌ని చంపేయాలని యత్నించింది.

అంతే ల్యూకాస్ ఫీజులు ఎగిరిపోయాయ్.. ఏంటి.. ఎందుకిలా చేస్తున్నావ్” అని అడిగితే… నువ్వు నన్ను గాయపరిచావు. కాబట్టి నేను కూడా నిన్ను గాయపరుస్తాను. నువ్వు నన్ను 15 ఏళ్లుగా వదిలేశావు” అని మాగ్నెట్రాన్ కోపంగా అరిచింది.

“15 ఏళ్ల కిందట మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరికొకరు కేర్ తీసుకునేవాళ్లం. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఓ రోజు నువ్వు కనిపించకుండాపోయావు. నువ్వు పెరిగి పెద్దవాడివయ్యావు. నేను ఉన్న సంగతే మర్చిపోయావు. 15 ఏళ్లుగా నాకు ఎవరూ లేరు. నేను ఒంటరి అయ్యాను. 15 ఏళ్లుగా నేను నరకంలో ఉన్నాను” అని మైక్రోవేవ్ నుంచి వాయిస్ ఇచ్చింది.

అది కథ.. ఇది కల్పితం కాదు.. రియల్ గానే జరిగింది.. కాబట్టి.. అత్యుత్సాహానికి పోయి.. యంత్రాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. ఇలాంటి ఘటనలే జరుగుతాయి. మోన్నటికిమొన్న.. ఓ పాప అలెక్సాతో ఆడుకుంటూ.. నాకు ఏదైనా టాస్క్ ఇమ్మని ఆ పాపా అడిగితే.. అలెక్సా.. కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టమని చెప్పింది.. ఆ సమయంలో వాళ్ల అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ఆ పిల్ల నిజంగానే వేలుపెట్టేదేమోగా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news