ఎయిర్‌హోస్టస్‌ జాబ్‌ మానేసి.. అడల్ట్‌ మోడల్‌ అయింది.. నెలకు రూ. 39 లక్షల ఆదాయం

ఈ మధ్య అమ్మాయిలు డబ్బు సంపాదించడం కోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చేసేపని తప్పు కాకపోతే చాలు ఎంత దూరమైనా వెళ్తున్నారు. మనసుకు నచ్చితే చాలు.. సమాజం ఏం అనుకున్నా పట్టించుకోకుండా దూసుకెళ్లిపోతున్నారు. పోలీస్‌జాబ్‌ వదిలేసి మరీ అడల్డ్‌ మోడల్‌ అయింది ఓ యువతి.. ఇది కూడా అలాంటి స్టోరియే. ఎయిర్ హోస్టెస్‌ జాబ్‌ వదిలేసి. ఒక మహిళ అడల్ట్ మోడల్‌గా మారింది..కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. గతంలో ఉద్యోగం కంటే ఆమె ఆదాయం రెండింతలు పెరిగిందని గర్వంగా చెబుతుంది..

OnlyFans model says she makes £40k per month in spite of trolls' cruel comments asking her to put a 'bag on her head' - Derbyshire Live

డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం..ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ నివాసి అయిన 22 ఏళ్ల అలెక్సియా గ్రేస్.. కాలేజీలో చదువుతున్నప్పటి నుండి విమానయాన పరిశ్రమలో చేరాలనే కోరిక ఉండేది.. అందుకే కాలేజ్ పూర్తయ్యాక నేరుగా ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగం కూడా సంపాదించుకుంది. జీతం రూ.12 లక్షలు. ఇంత డబ్బుతో దిల్‌ కుష్‌ అయింది.. వివిధ దేశాలను సందర్శించవచ్చు, నచ్చిన జాబ్ కూడా అని సంతోషం వ్యక్తం చేసింది. అయితే అలెక్సియాకు.. ప్రయాణం తక్కువగా ఉన్న ప్రదేశాలకు డ్యూటీ వేసేవాళ్లు . అటువంటి పరిస్థితిలో, ఆమెకు ఎక్కడికీ బయటకు వచ్చే అవకాశం లేదు, ఆమె ఎక్కువ సమయం ఫ్లైట్‌లోనే గడిపాల్సి వచ్చేది… అంతకు మించి ప్రయాణికుల తీరుతో కలవరపడింది. అందుబాటులో లేని వాటి కోసం కూడా ప్రయాణికులు గొడవపడేవారని అలెక్సియా చెప్పింది.

Flight attendant sick of 'rude customers' quits to earn £25k a month on OnlyFans instead | indy100

చాలా సార్లు ఎయిర్ హోస్టెస్‌ని కూడా ఇబ్బంది పెట్టేవారట.. దీంతో చిర్రెత్తిపోయిన ఆమె.. ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. ఉద్యోగం వదిలేసిన అలెక్సియా అడల్డ్ స్టార్‌గా మారిపోయింది. ఓన్లీ ఫ్యాన్స్ అనేది అడల్ట్స్‌ సబ్‌స్క్రిప్షన్ సైట్. ఇందులో వ్యక్తులు వారి అడల్ట్ ఫోటోలు-వీడియోలు, ఇతర వస్తువులను విక్రయిస్తారు. వినియోగదారులు డబ్బు చెల్లించడం ద్వారా మాత్రమే వారు ఆ కంటెంట్‌ను చూడగలరు. అలెక్సియా ఇప్పుడు కేవలం అభిమానుల నుండి నెలకు రూ. 39 లక్షలు సంపాదిస్తుంది. అంటే ఆమె వార్షిక ఆదాయం రూ.4 కోట్లు. భారీ సంపాదన ఉన్నప్పటికీ, చాలా మంది ఆమెను చిన్నచూపు చూస్తారని అలెక్సియా చెబుతోంది. అయినా తను అవేవి పట్టించుకోకుండా తనకు నచ్చినపని చేస్తున్నట్లు చెప్పింది. ఓన్లీ ఫ్యాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా చాలామంది అమ్మాయిలు కోట్లు సంపాదిస్తున్నారు. ఆ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగిపోతుంది.