మళ్లీ తెరపైకి హనీ ట్రాప్..న్యూడ్ వీడియో కాల్ తో టార్గెట్

తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. ఓపెన్ చెయ్యగానే నగ్నంగా కనిపించి..అందాన్ని ఎరగా వేస్తారు. ఆకర్షితులయ్యారా ఇక అంతే పని…మిమ్మల్ని వాళ్ళ దార్లోకి లాగుతారు. మీకు తెలియకుండా వీడియో రికార్డు చేస్తారు. మీరు చేసిన తప్పును మీకే చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వలేదో సోషల్ మీడియాలో పెట్టి మీ ఫ్యామిలీకీ.. ఫ్రెండ్స్‌కి పంపుతామని బెదిరిస్తారు. గతంలో సంచలనం సృష్టించిన హానిట్రాప్.. మళ్లీ తెరమీదకు వచ్చింది.

డబ్బు సంపాదించడమే పరమావధిగా.. అమాయకులకు గాలం వేస్తున్నారు కేటుగాళ్లు. గతంలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ మోసాలు మళ్లీతెర మీదకు వచ్చాయి. సోషల్ మీడియా… యాప్స్ ద్వారా ప్రజలను ఆకర్షించి.. మనీ సంపాదిస్తున్నారు కొందరు మోసగాళ్లు. యూపీ, హర్యానా, రాజస్థాన్‌కు చెందిన ఈ ఘనులు… కరోనా లక్డౌన్ సమయంలో బారి మోసాలకు పాల్పడ్డారు. డేటింగ్ యాప్స్‌కు వినియోగదారులు పెరగడాన్నిచూసి.. మళ్లీ ట్రాప్‌కి దించి దండుకుంటున్నారు.

మీరు వాడే డేటింగ్ యాప్‌ల ద్వారా మీ వివరాలను తెలుసుకుని.. తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారు. వారి అందని ఎరగా వేసి…మిమ్మల్ని ఆకర్షిస్తారు. మీరు కాల్ కట్ చేయకుండా మీతో మాట్లాడుతారు. మిమ్మల్ని వారి ముగ్గులోకి లాగుతారు. మీ నగ్న వీడియోలను తెలియకుండా రికార్డు చేస్తారు. అంత అయిపోయాక వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు.

మీతో వారు మాట్లాడిన వీడియోను మీకే పంపి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే బ్లాక్‌మెయిల్ చేస్తారు. మీ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు తెలుసుకుని.. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి పంపుతామంటూ బెదిరిస్తారు యూట్యూబ్ లో పెడుతామని టెన్షన్‌ పెడతారు. ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసి… ఈ మోసాలకు పాల్పడుతున్నారు.