ఎన్నికల డ్యూటీకి రాలేను సార్.. హనీమూన్ కు వెళ్తున్నా…!

-

Honeymoon plea wins teacher exemption from poll duty

డిసెంబర్ 7న తెలంగాణతో పాటు రాజస్థాన్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి తెలుసు కదా. డిసెంబర్ 11న రిజల్ట్స్ కూడా రానున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ టీచర్లకు, ఉద్యోగులకు డ్యూటీ పడుతుంది. వాళ్లకు ఎన్నికలయ్యేదాకా సెలవులు ఉండవు.. ఏముండవు. కుటుంబాన్ని వదిలి ఎన్నికల డ్యూటీ ఎక్కడ పడితే అక్కడికి పోవాల్సిందే. దీంతో రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఇప్పటికే మేము ఎన్నికల డ్యూటీకి రాలేమంటూ 160 అప్లికేషన్లు వచ్చాయట. దాంట్లో ఓ రెండు అప్లికేషన్లు మాత్రం ఎన్నికల అధికారులకు చాలా ఆసక్తిని కలిగించాయట. దీంతో ఆ ఇద్దరినీ ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయించారు.

మొదటి అప్లికేషన్ ఏంటంటే… సార్.. నా పేరు రాజ్ దీప్ లంబా. నేను జరియా గవర్నమెంట్ స్కూల్ లో పీఈటీగా పనిచేస్తున్నా. నాకు నవంబర్ 19 న పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత మీకు తెలుసు కదా అందరూ హనీమూన్ వెళ్తారని. నేను కూడా హనీమూన్ కోసం టికెట్లు బుక్ చేసుకున్నా. నా భార్య కోరిక మేరకు మేం హనీమూన్ కు సింగపూర్ వెళ్తున్నాం. విమానం టికెట్ల కోసం ఇప్పటికీ నేను 1.5 లక్షలు ఖర్చు చేశా. విమానం ఎక్కడం కూడా ఇదే తొలిసారి. ఇప్పుడు మీరు ఎన్నికల డ్యూటీ వేశారు. దీంతో నా హనీమూన్ ట్రిప్ ఆగిపోతుంది. నా భార్య అలుగుతుంది. టికెట్లు క్యాన్సెల్ చేయాలి. నాకు చాలా లాస్ జరుగుతుంది. అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. నేను ఎన్నికల డ్యూటీకి రాలేను సార్.. అంటూ అప్లికేషన్ లో వెల్లడించాడట ఆ వ్యక్తి. అప్లికేషన్ తో పాటు విమానం టికెట్ల కాపీలు కూడా జతచేశాడు. దీంతో రిటర్నింగ్ ఆఫీసర్.. మానవీయ కోణంలో ఆలోచించి.. అతడిని ఎన్నికల డ్యూటీ నుంచి రిలీవ్ చేశాడట.

ఇంకో అప్లికేషన్ ఏంటంటే.. సార్ నేను ప్రభుత్వ టీచర్ ను. నా బరువు సుమారు 140 కిలోలు. నేను చాలా లావుగా ఉంటా. పోల్ కు సంబంధించిన పనులు నేను చేయలేను. దయచేసి నన్ను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయించండి అంటూ అధికారిని కోరాడు. ఈ అప్లికేషన్ ను కూడా రిటర్నింగ్ అధికారి ఆమోదించాడు. చూశారుగా.. ఇలా రకరకాల కారణాలతో ఆ జిల్లా ఎన్నికల అధికారికి 160 అప్లికేషన్లు వచ్చాయట.

Read more RELATED
Recommended to you

Latest news