ఇండియాలోనే హైదరాబాద్ నెంబర్ వన్.. దేంట్లో తెలుసా?

అవును.. హైదరాబాద్ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేంట్లో నెంబర్ వన్‌గా నిలిచిందో చెప్పండి అంటారా? దేశంలోని నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పూణె కూడా నివాస యోగ్య నగరాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మెర్సెర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండియా ర్యాంకింగ్స్ 2019… ప్రపంచంలోనే నివాసయోగ్య నగరాల జాబితాను రిలీజ్ చేసింది.

ప్రపంచంలోని పలు నగరాల్లో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని.. సర్వే చేశారు. ఆ సర్వేలో ఇండియా నుంచి హైదరాబాద్, పూణెలు ప్రపంచంలో 143వ స్థానాన్ని సంపాదించి.. దేశంలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించాయి. గత సంవత్సరం వచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్, పూణె 142వ స్థానంలో ఉండేవి. ఈసంవత్సరం ఒక స్థానం కిందికి పడిపోయాయి. ప్రపంచం మొత్తం మీద మెర్సెర్స్ 231 నగరాల జాబితాను విడుదల చేసింది. దాంట్లో 7 మాత్రమే ఇండియాకు చెందిన నగరాలు ఉన్నాయి.