వైఎస్సాఆర్సీపీలో చేరిన నటుడు దాసరి అరుణ్ కుమార్

వైఎస్సాఆర్సీపీకి సినీ గ్లామర్ కూడా తోడవుతోంది. ఇప్పటికే సినీ నటులు అలీ, జయసుధ, రాజా రవీంద్ర వైసీపీలో చేరగా.. తాజాగా ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ కూడా వైసీపీలో చేరారు. ఆయన ఇవాళ లోటస్ పాండ్‌లో వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. ఈసందర్భంగా జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈసందర్భంగా జగన్.. వైసీపీ కండువాను దాసరి అరుణ్‌కుమార్‌కు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన దాసరి.. వైసీపీ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని వెల్లడించారు. జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.

వైసీపీలోకి గత కొన్ని రోజులుగా వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీలోకి చేరికలు కొనసాగడం టీడీపీకి మింగుడుపడటం లేదు.